ఆస్కార్ బరిలో ఇండియన్ షార్ట్‌ఫిల్మ్

2020కి గానూ ఆస్కార్ బరిలో ఓ భారతీయ లఘుచిత్రం పోటీపడబోతోంది. అట్లాంటా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైన ఓ లఘుచిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తమిళనాడులో జరిగిన నిజమైన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ లఘుచిత్రం పేరు ‘కమలి’. చెన్నై శివారులోని మహాబలిపురం సుగంధి అనే మహిళకు కమలి, హరీశ్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పిల్లలను తీసుకొని బయటకు వచ్చేసిన సుగంధి.. వారిని చదివించేందుకు బీచ్‌లో […]

ఆస్కార్ బరిలో ఇండియన్ షార్ట్‌ఫిల్మ్
Follow us

| Edited By:

Updated on: May 12, 2019 | 11:20 AM

2020కి గానూ ఆస్కార్ బరిలో ఓ భారతీయ లఘుచిత్రం పోటీపడబోతోంది. అట్లాంటా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైన ఓ లఘుచిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తమిళనాడులో జరిగిన నిజమైన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ లఘుచిత్రం పేరు ‘కమలి’.

చెన్నై శివారులోని మహాబలిపురం సుగంధి అనే మహిళకు కమలి, హరీశ్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పిల్లలను తీసుకొని బయటకు వచ్చేసిన సుగంధి.. వారిని చదివించేందుకు బీచ్‌లో చేపల వేపుడు, మసాలా పౌడర్లు తయారుచేసి అమ్ముతుంది. ఈ క్రమంలో తన కుమార్తె కమలికి స్కేటింగ్‌పై ఆసక్తి ఉందని గ్రహించిన ఆమె.. ఓ వ్యక్తి వద్ద స్కేట్ బోర్డింగ్ నేర్పుతుంది. ఇందుకోసం సుగంధి చాలా కష్టాలే పడుతుంది. అయితే స్కేటింగ్ నేర్చుకున్న కొద్ది రోజుల్లోనే కమలి తన ప్రతిభను చూపుతుంది. దీన్ని చూసిన పర్యాటకులు ఆమెను మెచ్చుకునేవాళ్లు. దానితో పాటు సర్ఫింగ్‌ను కూడా నేర్చుకుంటుంది. ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత స్కేటర్ జామీ థామస్ చెన్నైలో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు కమలి స్కేట్ బోర్డింగ్ చూసి.. అందులో ఆమెకు కొన్ని మెలకువలను చెబుతాడు. ఆ తరువాత ఆమె ప్రపంచ పోటీలకు వెళ్తూ.. అందులో సత్తా చాటుతుంటది. కమలిని చూసిన న్యూజిలాండ్ లఘుచిత్రాల దర్శకుడు సాషా రెయిన్‌బో ఆమె కథనే లఘుచిత్రంగా తీశాడు. ఈ చిత్రమే ఇప్పుడు ఆస్కార్‌కు ఎంపికైంది. ఈ షార్ట్ ఫిల్మిం మొత్తం నిడివి 24 నిమిషాలు ఉంటుంది.