Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..

| Edited By: Anil kumar poka

Jul 17, 2021 | 5:26 PM

విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో విక్రమ్ గా రానున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో బీఈ సినిమా తెరకెక్కుతుంది.

Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..
Vikram
Follow us on

విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో విక్రమ్ గా రానున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో బీఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరక్కేక్కిస్తున్నాడు లోకేష్. ఇటీవల దళపతి విజయ్ తో మాస్టర్ సినిమా తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు లోకేష్ . దాంతో ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు టీజర్ సినిమా పై అంచలనాలను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమా కోసం నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ విక్రమ్ సినిమా కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమల్ తో తలపడటానికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రంగంలోకి దిగనున్నారు.

తమిళనాడు ఎన్నికలు – కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లూ నిలిచిపోయిన ‘విక్రమ్’ సినిమా ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. కమల్ – విజయ్ సేతుపతి పాల్గొనే సన్నివేశాలను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో కమల్ – సేతుపతి – లోకేష్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కాకుండా మరో విలన్ కూడా ఉన్నారు. ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేశారు. ఇక ‘విశ్వరూపం 2’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న కమల్  శంకర్ దర్శకత్వంలో ”ఇండియన్ 2” చిత్రాన్ని ప్రారంభించారు. ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా స్టార్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ – రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభంకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. “ఏజెంట్” సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. “ఐస్‏క్రీమ్” ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?

Adi Saikumar: “అమరన్” ప్రారంభించిన ఆది.. తొలిసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న హీరో..