AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత బాటలో అఖిల్ బ్యూటీ.. పెద్దింటి కోడలు కాబోతుందా..!

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత అక్కినేని ఒకరు. ఏమాయ చేశావే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన సమంత.. పలు విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడటం.. ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకోవడం వెంట వెంటనే జరిగాయి. ప్రస్తుతం ఈ అక్కినేని కోడలు ఇటు కెరీర్, అటు ఫ్యామిలీ రెండింటిని విజయవంతంగా మెయిన్‌టెన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత బాటలోనే అఖిల్ బ్యూటీ కూడా వెళుతోందట. హలో […]

సమంత బాటలో అఖిల్ బ్యూటీ.. పెద్దింటి కోడలు కాబోతుందా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2019 | 7:58 PM

Share

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత అక్కినేని ఒకరు. ఏమాయ చేశావే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన సమంత.. పలు విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడటం.. ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకోవడం వెంట వెంటనే జరిగాయి. ప్రస్తుతం ఈ అక్కినేని కోడలు ఇటు కెరీర్, అటు ఫ్యామిలీ రెండింటిని విజయవంతంగా మెయిన్‌టెన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత బాటలోనే అఖిల్ బ్యూటీ కూడా వెళుతోందట. హలో మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టీ కల్యాణి ప్రియదర్శన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు, హీరో ప్రణవ్ లాల్‌తో కల్యాణి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు టాక్.

అయితే మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్(కల్యాణి ప్రియదర్శన్ తండ్రి)మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. మోహన్ లాల్‌తోనే ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన ప్రియదర్శన్.. ఆయనకు ఎన్నో హిట్లను కూడా ఇచ్చారు. దీంతో వీరిరువురి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇక ప్రణవ్ లాల్, కల్యాణి ప్రియదర్శన్‌లు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. తనకు ప్రణవ్ బెస్ట్ ఫ్రెండ్ అని కల్యాణి కూడా పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇక వీరిద్దరు సాన్నిహిత్యంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయగా.. వీరి ప్రేమపై ఇదివరకు కూడా చాలా సార్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వాటన్నింటిని ఈ ఇద్దరు ఖండిస్తూ వచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారట.  ఈ మధ్యనే ఈ ఇద్దరు తమ సినీ కెరీర్‌ను ప్రారంభించగా.. కెరీర్‌లో కాస్త సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటన్నారట. మరి ఇప్పుడొచ్చిన వార్తల్లో ఎంతనిజముందో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మోహన్ లాల్‌తో ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ‘మరక్కర్’ అనే చిత్రంలో ఈ ఇద్దరు కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనుండగా.. మరో మూవీలో ప్రణవ్, కల్యాణి కలిసి నటించబోతున్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా