Aswani Dutt: ఇప్పటి వరకు ఆ కోరిక తీరడం లేదంటున్న అశ్వనీదత్‌..

| Edited By: Janardhan Veluru

Sep 30, 2024 | 11:53 AM

అశ్వనీదత్‌..పరిచయం అవసరం లేని నిర్మాత.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ  సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించారు. అశ్వనీదత్‌‌ విలేకరులతో నిర్వహించిన ఓ చిట్‌చాట్‌లో తన కోరికను బయట పెటేశారు. 

Aswani Dutt: ఇప్పటి వరకు ఆ కోరిక తీరడం లేదంటున్న అశ్వనీదత్‌..
Aswani Dutt
Follow us on

అశ్వనీదత్‌..పరిచయం అవసరం లేని నిర్మాత.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ  సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అంటే ఓ బ్రాండ్ అనేలా క్రియేట్ చేశారు.  అశ్వనీదత్ మూడు తరాలు హీరోలతో సినిమాలు చేశారు.  ఎందరో హిరోలు, దర్శకులకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. వైజయంతి బ్యానర్‌కి ఇంత ఈమేజ్ ఈజీగా రాలేదు. దానికి అశ్వనీదత్ ఎంతో కృషి చేశారు. ఎన్ని ఫ్లాప్‌లు వచ్చిన ఎంతో పట్టుదలతో సినిమాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. అప్పట్టో వైజయంతి బ్యానర్‌లో వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అందరూ వైజయంతి బ్యానర్ పనైపోయిందని,  అశ్వనీదత్‌ నష్టంలో ఉన్నాడు ఇక సినిమాలు చేయడని అనుకున్నారు. కానీ అనుహ్యంగా మహానటి, కల్కి 2898 వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఫుచర్లో కూడా వైజయంతి బ్యానర్‌లో పెద్ద హిరోల సినిమాలు రాబోతున్నాయి.

ప్రస్తుతం వైజయంతి బ్యానర్‌ను అశ్వనీదత్‌ నడపడం లేదు. అతని వారసులు కొనసాగిస్తున్నారు. అశ్వనీదత్‌ వారి వారసులకు సూచనలు సలహాలను అందిస్తూ విజయపథంలో బ్యానర్‌ను నడిపిస్తున్నారు. ఇటీవలే రూ.1150 కోట్ల‌ భారీ బడ్జెట్‌తో వైజయంతి బ్యానర్‌లో  నాగ్ అశ్విన్ ద‌ర్శకత్వంలో వచ్చిన  కల్కి 2898 ఏడీ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. ప్రభాస్ కెరీయర్‌లో బహుబలి తర్వాత కల్కి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక ప్రాతలో నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అమితాబ్ పాత్రే డామినేట్ చేసిందని చెప్పాలి. కొందరు అయితే ప్రభాస్ హిరో కాదు అమితాబ్‌ హిరోలా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిరోయిన్‌గా దీపికా పదుకొనే నటించింది. అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను నాగ్ అశ్విన్ వాడేశారనే చెప్పాలి. ప్రస్తుతం వైజయంతి బ్యానర్‌ను అశ్వనీదత్‌ సహకరంతో నడిపిస్తున్నట్లు వారసులు ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అశ్వనీదత్‌‌ విలేకరులతో నిర్వహించిన ఓ చిట్‌చాట్‌లో తన కోరికను బయట పెటేశారు.  డైరెక్టర్ రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం1‌‌తో కలిసి చేసినట్లు చెప్పారు. అప్పుడే రాజమౌళి సినిమాను అద్భుతంగా తీశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి తనతో సినిమాను తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ సినిమా చేద్దామంటే కుదరడం లేదన్నారు. కానీ ఇప్పటికి తనతో సినిమా చేయాలనే కోరిక తీరడం లేదన్నారు. స్టూడెంట్ నెం.1‌‌ సినిమా విడుదలై 24 సంవత్సరాలైనా మళ్లీ అశ్వనీదత్‌ రాజమౌళితో సినిమా చేయకపోవడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.