AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: చెర్రీ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన కాదంబరి, బ్రహ్మాజీ పోస్టులు..

Ram Charan:మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. అనతికాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు.

Ram Charan: చెర్రీ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన కాదంబరి, బ్రహ్మాజీ పోస్టులు..
Ram Charan
Basha Shek
|

Updated on: Apr 13, 2022 | 4:04 PM

Share

Ram Charan:మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. అనతికాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సేవా దృక్పథంలోనూ తండ్రినే ఫాలో అవుతున్నాడు చెర్రీ. తన తండ్రి ప్రారంభించిన చిరు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రష్యాతో యుద్ధంలో పోరాడుతోన్న ఓ ఉక్రెయిన్‌కు బాడీగార్డ్‌కు ఆర్థిక సహాయం అందజేసి అభిమానుల మనసు గెల్చుకున్నాడీ మెగా హీరో. కాగా ఆపత్కాలంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు తన వంతు సాయమందించి మరోసారి మంచి మనసు చాటుకున్నాడు చెర్రీ. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్‌ (kadambari kiran) ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. చరణ్‌ మంచితనాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వేరు..

‘మనకు తెలిసి రామ్‌ చరణ్‌ అంటే మెగాస్టార్‌ తనయుడు, స్టార్‌హీరోనే. కానీ ఆయన పెద్ద మనసున్న వ్యక్తి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు అతనిలో నిండి ఉన్నాయి. సాటి మనిషికి సాయం అందించే వ్యక్తిత్వం కలవాడు. గతంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్‌ అన్న చొరవతో చరణ్‌ని సాయం అడిగితే రూ.2 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బుతో ‘మనం సైతం’ ద్వారా కార్యక్రమాలన్నీ పూర్తి చేశాను. ఇలా మరికొంత మంది నుంచి మరో లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాప పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించాం. అయితే.. ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత తాజాగా నేను రామ్‌ చరణ్‌కు ఎదురుపడ్డాను. ఆయన నన్ను చూసి.. ‘కాదంబరి గారూ.. ఆ పాప ఎలా ఉంది’ అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. గోల్డెన్ స్పూన్ తో  పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియమైన చరణ్‌, నీకు భగవదాశీస్సులు’ అని వరుస ట్వీట్లు పెట్టాడు కిరణ్‌. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా తన ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. దీంతో ప్రస్తుతంఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చెర్రీ మంచి మనసును మెచ్చుకుంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Andhra Pradesh: ఏపీ ప్రజలపై మరో భారం.. ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధింపు

ఆమ్నా షరీఫ్ అందాల విందు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Government Vs Governor: గవర్నర్‌తో పెరుగుతున్న గ్యాప్.. తెలంగాణ కేబినెట్ విస్తర‌ణ‌ ఇప్పట్లో లేనట్లేనా..?