AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: ఆ హీరో అంటే చాలా ఇష్టమన్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ డైరెక్టర్ మెచ్చిన ఆ స్టార్ ఎవరంటే..

కేజీఎఫ్( K.G.F).. ఈ ఒక్క సినిమా అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా పాన్ ఇండియా హవాను మొదలు పెడితే..

Prashanth Neel: ఆ హీరో అంటే చాలా ఇష్టమన్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ డైరెక్టర్ మెచ్చిన ఆ స్టార్ ఎవరంటే..
Prashanth Neel
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2022 | 3:23 PM

Share

కేజీఎఫ్( K.G.F).. ఈ ఒక్క సినిమా అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా పాన్ ఇండియా హవాను మొదలు పెడితే.. కేజీఎఫ్ సినిమా దానిని మరింత ముందు తీసుకెళ్లింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది, కేజీఎఫ్ సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమానుంచి ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు ( ఏప్రిల్ 14న )కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ తో సినిమా చేయటానికి స్టార్ హీరోలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా మొదలు పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు ప్రశాంత్ నీల్. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య ప్రశాంత్ నీల్ మెగాస్టార్ చిరంజీవిని, రామ్ చరణ్ ను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ  తన ఫ్యావరెట్ హీరోగురించి చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానం అని అన్నాడు. తనకు స్ఫూర్తి చిరంజీవీనే అని.. చిన్నప్పటి నుంచి తాను చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగానని తెలిపాడు ప్రశాంత్ నీల్. ఆయన సినిమాల్లో హీరో కు ఇచ్చే ఎలివేషన్స్ తనకు ఎంతో ఇష్టమని..అలాగే మాస్ ఎలిమెంట్ సీన్స్ ఆయన సినిమాల్లో బాగా ఇష్టమని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దాంతో మెగా అభిమానుల్లో ఓ కోరిక మొదలైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మెగాస్టార్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nivetha Pethuraj: గ్లామర్ డోస్ పెంచేసిన నివేత పేతురాజ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Rashmi Gautam:పింక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ రష్మి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Beast Movie Review: న‌వ్విస్తూ, ఎమోష‌న‌ల్‌గా ఎంట‌ర్‌టైన్ చేసిన బీస్ట్..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..