AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ యుద్ధం వస్తోంది.. ఏం పర్లేదు.. నేనున్నా

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన కేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో సైతం కనిపించని పాల్.. ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ముందుగా తాను రెగ్యులర్‌గా షోలో కనిపించడం లేదని క్షమాపణలు కోరిన పాల్.. ‘‘మూడో […]

ప్రపంచ యుద్ధం వస్తోంది.. ఏం పర్లేదు.. నేనున్నా
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 04, 2019 | 5:21 PM

Share

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన కేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో సైతం కనిపించని పాల్.. ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ముందుగా తాను రెగ్యులర్‌గా షోలో కనిపించడం లేదని క్షమాపణలు కోరిన పాల్.. ‘‘మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ యుద్ధాన్ని ఆపేందుకు ఏడు ప్రపంచ దేశాలకు చెందిన నేతలను కలిసాను. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాయబోతున్నా’’ అంటూ వివరించాడు. ఇక ఈ వీడియోకు వర్మ దండాలు ఉన్న ఎమోజీలని పెట్టగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ పాల్ చాలానే చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన వ్యాఖ్యలు నిజాలే అయినప్పటికీ.. కాలక్రమేణా కామెడీగా అయిపోయాయి.

ఇదిలా ఉంటే వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లులో చిత్రంలో కేఏ పాల్ పాత్రను కూడా పెట్టారు. అంతేకాదు అందులో కేఏ పాల్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు.. ఓ పాటను కూడా విడుదల చేశాడు. వీటికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన హడావిడినంతా ఈ సినిమాలో చూపించబోతున్నారు వర్మ.

Follow Us
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!