చాలా కాలం తరువాత గొప్ప చిత్రాన్ని చూశాను: కళాతపస్వి

చాలా కాలం తరువాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశానని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన సర్వం తాళ మయం చిత్రాన్ని విశ్వనాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కు నా ఆశీర్వాదాలు. చాలా కాలం తరువాత ఓ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:08 am, Thu, 7 March 19
చాలా కాలం తరువాత గొప్ప చిత్రాన్ని చూశాను: కళాతపస్వి

చాలా కాలం తరువాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశానని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన సర్వం తాళ మయం చిత్రాన్ని విశ్వనాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కు నా ఆశీర్వాదాలు. చాలా కాలం తరువాత ఓ గొప్ప చిత్రాన్ని చూశాను’’ అంటూ ప్రశంసలు కురిపించారు.

విశ్వనాథ్‌తో పాటు ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, నాగ అశ్విన్, మహి వీ రాఘవ్ తదితరులు ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జీవీ ప్రకాశ్, అపర్ణ బాలమురళి, నేడుముడి వేణు, వినీత్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రం మార్చి 8న తెలుగులో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది.