డైమండ్ చెవిపోగును పోగొట్టుకొని బాధపడుతున్న అలనాటి సుందరి.. ఎవరికైనా దొరికితే అందించాలని వేడుకోలు..
నిత్యం మనం వాడే వస్తువుల్లో ఏదైనా మిస్సయితే చాలా బాధపడుతాం. అవి ఆభరణాలైతే ఇంకా కంగారుపడతాం.

నిత్యం మనం వాడే వస్తువుల్లో ఏదైనా మిస్సయితే చాలా బాధపడుతాం. అవి ఆభరణాలైతే ఇంకా కంగారుపడతాం. ఇక ఆడవారైతే ఆ వస్తువు దొరికే వరకు తిండి, తిప్పలు ముట్టరు అలా ఉంటుంది వ్యవహారం. తాజాగా అలనాటి బాలీవుడ్ సూపర్ హీరోయిన్‌కి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఒకప్పుడు బాలీవుడ్‌ను కుమ్మేసిన హీరోయిన్ జూహీచావ్లా అందరికి తెలిసే ఉంటుంది. తన సినిమాలతో ఎంతో మందిని ఆకట్టుకున్న నటి. దాదాపుగా బాలీవుడ్ అగ్ర హీరోలందరితో నటించింది. తాజాగా ఈమె తన డైమండ్ చెవిపోగును పోగొట్టుకుందట. ఫ్యామిలితో కలిసి హరిద్వార్‌కు వెళ్లినప్పుడు ఈ ఆభరణాన్ని పోగొట్టుకుందని సమాచారం. దీంతో చాలా బాధపడుతుంది ఈ అమ్మడు. ఆ చెవిపోగంటే తనకు ప్రాణమని ఎవరికైనా దొరికితే అందించాలని సోషల్ మీడియా కేంద్రంగా వేడుకుంది. ఈ సందర్భంగా చెవిపోగు ఎలా మిస్సయిందో చెప్పుకొచ్చింది. ఉదయం తాను ముంబై ఎయిర్‌పోర్ట్ వెళ్లగా ఎమిరేట్స్ సెక్యూరిటీ చెక్ ఇమిగ్రేషన్స్ తర్వాత విమానం ఎక్కానని అంది. ఆ తర్వాత చూసుకుంటే తన చెవిపోగు కనిపించలేదని చెప్పింది. అది ఎవరికైనా దొరికితే ఇచ్చేస్తా తాను చాలా సంతోషపడుతానని తెలిపింది. 15 సంవత్సరాలుగా దీనినే ధరిస్తున్నానని ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వేడుకుంది.



