NTR : ఎంత మంచివాడవయ్యా..! అభిమాని కోరిక తీర్చిన తారక్.. వైరల్ అవుతున్న పోస్ట్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ హీరో అటు వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తనదైన టైమింగ్‌తో అభిమానులను అలరిస్తుంటారు. సాధారణంగా ఎన్టీఆర్ నెట్టింట యాక్టివ్ గా ఉండడం.. తన పర్సనల్ విషయాలు చుకోవడం చాలా అరుదు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఫుల్ యాక్షన్ మూవీ ఉండనుంది. అలాగే ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తారక్ నటుడిగానే కాదు వంటలు కూడా ఇరగదీస్తుంటారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తన వంట గురించి మాట్లాడారు తారక్.. అలాగే ఆయన కో స్టార్స్ కూడా తారక్ అద్భుతంగా వంట చేస్తారు అని ప్రశంసించారు..
కాగా ఇటీవల తారక్ సోషల్ మీడియాలో కుక్కీస్ తాయారు చేశా అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. కాగా ఓ అభిమాని తన పిల్లలకు కూడా కుకీస్ పంపమని అడిగాడు. దానికి తారక్ ఫన్నీగా రిప్లే ఇచ్చారు. ఈ ఫొటోలను చూసిన సాయితేజ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?” అని అభిమాని అడగ్గా అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అంటూ ఫన్నీ మీమ్ తో రిప్లే ఇచ్చారు .
కాగా ఇప్పుడు ఆ అభిమానికి కుకీస్ పంపించారు తారక్. తమ రిక్వెస్ట్‌కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. తారక్ పంపిన కుకీస్ పిల్లలు తింటున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ” ఎన్టీఆర్ గారు మీకు చాలా ధన్యవాదాలు ప్రేమతో అమ్మ , స్మరణ్ మరియు స్థరక.. మామూలుగా ఒక కామెంట్‌గా మొదలైంది.. ఊహించని విధంగా ఒక మధురమైన క్షణంగా మారింది. ఈరోజు, కుకీలు ఇంటికి చేరాయి. పిల్లలు సంతోషంగా ఉన్నారు, ఆటోగ్రాఫ్‌తో నేను ఆనందంతో గాల్లో తేలుతున్నాను, ఈ క్షణం ఎంత హృద్యంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నా.. అంటూ ఆ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK
— saiteja (@saitejaathoti) June 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
