‘జీవోటీ’లో నా పాత్ర ముగిశాక అప్పుల్లో పడ్డా, పస్తులతో గడిపాం: ఆక్వామెన్
ఆక్వామెన్‌తో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ నటుడు జాసోన్ మొమోయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jason Momoa GoT Stint: ఆక్వామెన్‌తో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ నటుడు జాసోన్ మొమోయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు జాసోన్. అయితే ఈ నటుడు అంతుకుముందు ప్రముఖ సిరీస్ జీవోటీ(గేమ్ ఆఫ్ త్రోన్స్)లో నటించిన విషయం తెలిసిందే. ఖల్ డ్రోగో అనే పాత్రలో జాసోన్ నటించారు. ఆ పాత్రలో అంతలా మెప్పించినప్పటికీ., అతడి పాత్ర మాత్రం మొదటి సీజన్‌కే ముగిసింది. ఆ తరువాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ( ఢిల్లీలో మూడో వేవ్ మొదలైంది: ఆరోగ్య మంత్రి)
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాసోన్.. జీవోటీలో నా పాత్ర ముగిసిన తరువాత నాకు అవకాశాలు కరువయ్యాయి. లాస్‌ఏంజిల్స్‌లో నేను ఉన్న ఇంటి రెంట్ కూడా కట్టలేకపోయా. అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అది నాకు నిజంగా క్లిష్టమైన సమయం. మా కుటుంబం మొత్తం పస్తులు కూడా ఉన్నాము. ఆ సమయంలో మా ఇంటిని మా ఫ్రెండ్‌తో షేర్ చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు. ( తాత అయిన విక్రమ్.. ఆడపిల్లకు జన్మనిచ్చిన చియాన్ కుమార్తె)