డ్రగ్స్‌ కేసు.. ఎన్సీబీ విచారణకు హాజరైన నాగ్ హీరోయిన్

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు

డ్రగ్స్‌ కేసు.. ఎన్సీబీ విచారణకు హాజరైన నాగ్ హీరోయిన్
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2020 | 3:46 PM

Gabriella Demetriades NCB: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటి, అర్జున్‌ రాంపాల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా డెమెట్రియాడీస్‌ ఎన్సీబీ అధికారులు ముందుకు హాజరయ్యారు. ( ‘జీవోటీ’ నా పాత్ర ముగిశాక అప్పుల్లో పడ్డా, పస్తులతో గడిపాం: ఆక్వామెన్)

కాగా ఇటీవల అర్జున్ రాంపాల్‌కి చెందిన ముంబయిలోని బాంద్రా ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌ బయటపడ్డాయి. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ అర్జున్ రాంపాల్‌, గాబ్రియెల్లాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గాబ్రియెల్లా ఎన్సీబీ అధికారుల ముందు హాజరు కాగా.. అర్జున్ గురువారం విచారణకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో గాబ్రియెల్లా సోదరుడు ఏజిసిలావోస్‌ డెమెట్రియాడీస్‌ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా గాబ్రియెల్లా తెలుగులో ఊపిరి సినిమాలో నటించిన విషయం ( ఢిల్లీలో మూడో వేవ్ మొదలైంది: ఆరోగ్య మంత్రి)