AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : అయ్య బాబోయ్.. అచ్చియమ్మ అదిరిపోనాదిరోయ్.. పెద్ది నుంచి జాన్వీ స్పెషల్ వీడియో..

బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు జాన్వీ కొత్త సినిమా విశేషాలు, అప్డేట్స్ పంచుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది సినిమా నుంచి సైతం జాన్వీకి సంబంధించిన స్పెషల్ వీడియో షేర్ చేశారు.

Peddi Movie : అయ్య బాబోయ్.. అచ్చియమ్మ అదిరిపోనాదిరోయ్.. పెద్ది నుంచి జాన్వీ స్పెషల్ వీడియో..
Janhvi Kapoor Peddi Movie
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2026 | 12:11 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, చికిరి సాంగ్ వీడియో తెగ పాపులర్ అయ్యింది. తాజాగా మార్చి 6న జాన్వీ పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ చెబుతూ పెద్ది సినిమా నుంచి స్పెషల్ వీడియో షేర్ చేశారు మేకర్స్.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

తాజాగా విడుదలైన వీడియోలో జాన్వీ విజువల్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో జాన్వీ లుక్స్ చూస్తేంటే ఆమె పాత్ర సినిమాలో ఎంత మాస్ గా ఉండనుందో అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతకు ముందు దేవర సినిమాలోనూ జాన్వీ పక్కా పల్లెటూరి అమ్మాయిల.. మాస్ పాత్రలో అలరించింది. ఇప్పుడు మరోసారి పెద్ది చిత్రంలో అచ్చియమ్మగా మెప్పించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం జాన్వీ స్పెషల్ లుక్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

కొన్నాళ్లుగా పెద్ది సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతోపాటు జాన్వీ మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

Follow Us