AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ మూవీ నుంచి జగ్గు భాయ్ ఔట్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక నటిస్తోండగా.. విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి జగపతి బాబు ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ప్రకాష్ […]

మహేష్ మూవీ నుంచి జగ్గు భాయ్ ఔట్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 16, 2019 | 8:51 PM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక నటిస్తోండగా.. విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి జగపతి బాబు ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారని సమాచారం. కారణాలు తెలీవు కానీ ఈ మూవీ నుంచి జగపతి బాబు తప్పుకున్నారట.

అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, మహర్షి చిత్రాల్లో జగపతిబాబు కీలక పాత్రలలో నటించగా.. ఆ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు