AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు.. విషంగా మారుతాయ్ జాగ్రత్త..

చికెన్‌లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ.. దాన్ని తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, పుల్లటి పండ్లు, డీప్‌ ఫ్రైడ్‌ పదార్థాలను చికెన్‌ తర్వాత తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు.. విషంగా మారుతాయ్ జాగ్రత్త..
Chicken Combinations
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2026 | 7:34 PM

Share

మాంసాహార ప్రియుల ఆహారంలో చికెన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చికెన్‌ను ఆదివారం అనే కాకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. ఇంకా చికెన్ ప్రియులకైతే.. చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు.. ముఖ్యంగా.. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ, గ్రిల్డ్ చికెన్ వంటి వంటకాలను చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్‌ను అందించి శక్తిని ఇచ్చినప్పటికీ, దాన్ని తిన్న వెంటనే లేదా దానితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ తిన్న తర్వాత తినకూడని.. ఆహార పదార్థాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

చికెన్ తిన్న తర్వాత దూరంగా ఉంచాల్సిన ప్రధాన ఆహారాలు – వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే:

పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, పన్నీర్):

చికెన్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉండగా, పాలలో క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండూ భిన్నమైన పోషక గుణాలు కలిగినవి కావడం వల్ల, ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తి, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు ఈ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండాలి.

స్వీట్లు – ఐస్‌క్రీమ్‌లు:

చికెన్ తిన్న వెంటనే స్వీట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు లేదా చక్కెర ఎక్కువ ఉండే కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు. అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒకేసారి పెంచి, ఆ తర్వాత వేగంగా పడిపోయేలా చేస్తుంది. దీనివల్ల శరీరం తీవ్రమైన అలసట, నీరసానికి గురవుతుంది.

సిట్రస్ ఫలాలు (పుల్లటి పండ్లు):

నిమ్మకాయ, నారింజ, బత్తాయి (మోసంబి) వంటి సిట్రిక్ యాసిడ్ ఆమ్ల గుణాలు కలిగిన పండ్లను చికెన్‌తో కలిపి లేదా వెంటనే తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం (Acidity) పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణసమస్యలకు దారితీస్తుంది.

నూనెలో వేయించిన పదార్థాలు (డీప్ ఫ్రైడ్ స్నాక్స్):

చికెన్ తిన్న తర్వాత బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటి అధిక నూనె కలిగిన పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం మరింత పెరుగుతుంది. ఈ తరహా ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, గ్యాస్, అలసట కలుగుతాయి. తరచుగా ఈ అలవాటు కొనసాగితే దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆరోగ్యంగా ఉండటానికి కేవలం మంచి పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఏ ఆహారంతో దేనిని కలిపి తీసుకుంటున్నామనే ‘ఆహార కలియకల’ (Food Combinations) పై కూడా శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. చికెన్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్న తర్వాత తగిన విరామం ఇచ్చి మాత్రమే ఇతర తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా