AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం…

నారాయణపేట మక్తల్ పట్టణంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయవంతంగా రన్ అవుతున్న ఇరుముడి సినిమాను థియేటర్ నుంచి అకస్మాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తిరిగి అదే సినిమాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

Irumudi : ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా.. చివరకు దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం...
Irumudi
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 6:22 PM

Share

మక్తల్ పట్టణంలోని వేంకటేశ్వర సినిమా థియేటర్ లో హీరో రవితేజ నటించిన ఇరుముడి సినిమా రిలీజ్ చేశారు. అప్పటి నుంచి విజయవంతంగా సినిమా ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తున్నారు. దీంతో ప్రతి షో లో టికెట్లు దొరకకపోవడం హౌజ్ ఫుల్ కావడంతో సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ సెలవు రోజు కావడంతో సినిమాను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రేక్షకులు ఫ్యామిలీలతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం ఇరుముడి సినిమా ప్రదర్శనను తీసేసి మరో కొత్త సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంతో ఆశగా ఇరుముడి సినిమా చూద్దామని వస్తే వేరే సినిమా ప్రదర్శిస్తున్నారని ఆందోళనకు దిగారు. థియేటర్ ముందు ప్రేక్షకులు, అయ్యప్పస్వామి భక్తులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇరుముడి సినిమానే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

ఆందోళనకు దిగిన ప్రేక్షకులతో థియేటర్ యాజమాన్యం చర్చించింది. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ ఇరుముడి సినిమాను ప్రదర్శిస్తామిన నచ్చచెప్పారు. అయినప్పటికీ ప్రేక్షకులు, అయ్యప్ప స్వామి భక్తులు వినలేదు. విజయవంతంగా కొనసాగుతున్న ఇరుముడి సినిమాను ఎందుకు తొలగించారంటూ తిరిగి ప్రశ్నించారు. దీంతో వెనక్కి తగ్గిన యాజమాన్యం చేసేది లేక తిరిగి ఇరుముడి సినిమానే ప్రదర్శించాలని నిర్ణయించింది.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

ఇక ఆందోళనకు దిగిన ప్రేక్షకులు, భక్తులు శాంతించారు. ఆశగా సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు పట్టుబట్టి చివరకు తమకు కావాల్సిన సినిమానే థియేటర్ లో కొనసాగించుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

Follow Us
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!