దెబ్బకు జాతకం మారిపోయింది..! ఇరుముడితో గుర్తింపు.. ఎల్లమలో ఛాన్స్ కొట్టేసిన నటుడు..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది.

జబర్దస్త్ వేదికగా తన ప్రత్యేకమైన తెలంగాణ మాండలికంతో, సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన కమెడియన్ కొమరం. ఈ నటుడు కొమురక్కగా బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను నవ్వించిన కొమురం ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నాడు. ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమ నుంచి అనూహ్యమైన గుర్తింపును అందుకున్నారు. తన నటనా ప్రతిభను సరైన వేదికలపై ప్రదర్శించే అవకాశం రాలేదని తరచుగా బాధపడే కొమరంకు, బలగం, ఎల్లమ్మ వంటి విజయవంతమైన చిత్రాలలో భాగం కాలేకపోయినందుకు నిరాశ ఉండేది. ఇటీవలే ఇరుముడి సినిమాలో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇరుముడి సినిమాలో కొమరం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి భయపెట్టాడు. ఈ సినిమాతో కొమరంకు మంచి పేరు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొమరం మాట్లాడుతూ..
Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే
ఇటీవల ప్రముఖ దర్శకుడు వేణు యెల్దండి( బలగం దర్శకుడు) నుంచి కొమరంకు ఒక ఫోన్ కాల్ వచ్చిందట. ఇది ఆయన జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని కొమరం పంచుకున్నాడు. వేణు స్వయంగా కాల్ చేసి, “ఒరేయ్ కొమరం, నువ్వు మామూలుగా చేయలేదురా..!! చింపేశావు రా! అంత పెద్ద హీరోతో ఆపోజిట్ క్యారెక్టర్. శివ నిర్వాణ సార్ కి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. 12 ఏళ్లుగా నీ జర్నీ చేస్తున్న మాకే అనిపించలేదు రా, నీ మీద అంత స్కోప్ ఉందని. మేమే ఆలోచించలేకపోయాము,” అని అభినందించినట్లు కొమరం సంతోషంగా తెలియజేశాడు. ఈ ప్రశంసలు కొమరం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయట.
రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు
శివ నిర్వాణ దర్శకత్వంలో, రవితేజ వంటి పెద్ద హీరోతో పాటుగా ఇరుముడి చిత్రంలో కొమరం పోషించిన పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో.. వేణు యెల్దండి మెచ్చుకోవడం.. ఆయన మాట్లాడుతూ.. “నీ కళ్ళను మాత్రం భలే చూపించాడు. చాలా బాగా చేశావు. అసలు అల్టిమేట్. అసలు కొమరక్క ఎక్కడ కనపడలేదు, ఆ నాగులుగాడే కనపడ్డాడు” అని ఆయన నటనను మెచ్చుకున్నారట వేణు. గతంలో బలగం, ఎల్లమ్మ వంటి చిత్రాలలో అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన కొమరంకు, ఇప్పుడు దర్శకుడు వేణు నుంచి ఫోన్ రావడంతో పాటు ఎల్లమ్మ సినిమాలోనూ ఓ పాత్ర ఆఫర్ చేసినట్టు తెలిపాడు కొమరం.
ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




