AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే

పూర్వకాలంలో వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే మన పెద్దలు మధ్యాహ్న భోజనం కోసం ఎంతో సులువైన, రుచికరమైన పద్ధతులను అనుసరించేవారు. స్టవ్ వెలిగించే పని లేకుండా, చుక్క నూనె కూడా వాడకుండా కేవలం వంటింట్లో ఉండే పచ్చి దినుసులతో అప్పటికప్పుడు రోట్లో దంచుకుని తినే 'పొలం పచ్చడి' అందులో ఎంతో విశిష్టమైనది.

Phani CH
|

Updated on: Aug 25, 2026 | 9:24 PM

Share
ఎలాంటి వేపుడు లేదా ఉడికించడం లేకపోవడం వల్ల దినుసుల్లోని పోషకాలు, సహజసిద్ధమైన రుచి ఏమాత్రం తగ్గవు. వేడివేడి అన్నం, చద్దన్నం లేదా పెరుగన్నంలోకి నంజుకోవడానికి అదిరిపోయే ఈ ప్రాచీన రోటి పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 10 లావుపాటి తక్కువ కారముండే పచ్చిమిరపకాయలు,  ఒకపెద్ద ఉల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు,  10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు కలుపుకోవడానికి ఒక చెంచా స్వచ్ఛమైన వేరుశనగ నూనె (ఆప్షనల్).

1 / 5
తయారీ విధానం: ముందుగా పచ్చిమిరపకాయలను ఎంచుకునేటప్పుడు సన్నగా, కారంగా ఉండేవి కాకుండా లావుగా, తొక్క మందంగా ఉండి కారం తక్కువగా ఉండేవాటిని తీసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువగా తినేవారైతే ఒకటి లేదా రెండు ఘాటైన మిర్చిలను కలుపుకోవచ్చు. ఉల్లిపాయను మీడియం ముక్కలుగా కోసి, ఘాటు తగ్గేందుకు ఒకసారి నీళ్లలో కడిగి పక్కన ఉంచుకోవాలి. చింతపండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ పచ్చి జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా నూరాలి. అనంతరం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కొద్దికొద్దిగా వేస్తూ దంచాలి. పచ్చిమిర్చి మరీ పేస్ట్‌లా కాకుండా కాస్త నలిగిన తర్వాత, కడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చాపచ్చాగా దంచాలి.

3 / 5
ఉల్లిపాయలు మరీ గుజ్జుగా అవ్వకుండా బరకగా ఉంటేనే తింటున్నప్పుడు పంటికి తగిలి ఎంతో రుచిగా ఉంటాయి. రోలు లేనివారు మిక్సీ జార్‌లో పల్స్ మోడ్‌లో ఒక్కసారి తిప్పుకోవచ్చు. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
అంతే, ఎంతో ఘుమఘుమలాడే సంప్రదాయ పొలం పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని, పైన ఒక స్పూన్ పచ్చి వేరుశనగ నూనె వేసి కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. చల్లని పెరుగన్నంలోకి ఇది బెస్ట్ కాంబినేషన్!

5 / 5
Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..

గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే

ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..

నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు

గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..

ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!

మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?

ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు