AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న లేటేస్ట్ సినిమా ఇరుముడి. డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఈ లేటేస్ట్ ఎమోషనల్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం ఉదయం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ఇరుముడి కట్టు విడుదలైంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది.

Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..
Irumudi Kattu Song
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2026 | 12:04 PM

Share

మాస్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో మాస్ మహారాజా రవితేజ. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ ఎమోషనల్ డ్రామా ఇరుముడి. మాస్ మహారాజాతోపాటు.. విభిన్నమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఒక సరికొత్త డివోషనల్ ఎండ్ ఎమోషనల్ డ్రామా పై మంచి హైప్ నెలకొంది. టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట ‘ఇరుముడి కట్టు’ (కట్టు కట్టు ఇరుముడి కట్టు) సోమవారం విడుదలైంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ పాటకు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్, గూస్‌బంప్స్ తెప్పించే భక్తి సంగీతం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు.. ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అయ్యప్ప మాలధారుల హై-ఎనర్జీ డ్యాన్సులు, ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే నామస్మరణతో సాగే ఈ గీతం వింటుంటేనే ఒళ్లు పులకరించేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. ఈ చిత్రంలో ‘విల్లాలి వీరుడు’, ‘మల్లెపూల పల్లకి’ వంటి మరికొన్ని పాపులర్ భక్తి గీతాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయంటూ టాక్ నడుస్తుంది.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

రవితేజ కెరీర్‌లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోనుందని తెలుస్తోంది. మద్యం వ్యసనానికి బానిసైన ఓ మధ్యతరగతి తండ్రి, ఆ అలవాటు వల్ల తన ప్రాణ సమానమైన కూతురికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి, తన బిడ్డ కోసం ఆయన అయ్యప్ప దీక్షను ఎలా స్వీకరించాడు? ఆ స్వామి అనుగ్రహంతో వారి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే హృద్యమైన, భావోద్వేగ భరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజ మునుపెన్నడూ పోషించని ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, అయ్యప్ప భక్తుడిగా మునుపెన్నడూ చూడని సరికొత్త డివోషనల్ అవతారంలో అలరించనున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

కట్టు కట్టు ఇరుముడి కట్టు సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

Follow Us