నాలుగు నెలల్లో 40 మంది.. లిఫ్ట్ పేరుతో వల.. ఏం చేశారో తెలిస్తే షాక్..!
హర్యానాలోని పంచకులలో లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి అమాయకులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు దోచుకుంటున్న ఓ జంట గుట్టు రట్టయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మాదకద్రవ్యాల వ్యసనం అలవాటు పడి, కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 40 మందిని మోసం చేశారు. బాధితులను లక్ష్యంగా చేసుకుని రూ.4 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఓ వలస కార్మికుడు చేసిన ఫిర్యాదుతో వారి మోసం వెలుగులోకి వచ్చింది.

హర్యానాలోని పంచకులలో లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి అమాయకులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు దోచుకుంటున్న ఓ జంట గుట్టు రట్టయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మాదకద్రవ్యాల వ్యసనం అలవాటు పడి, కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 40 మందిని మోసం చేశారు. బాధితులను లక్ష్యంగా చేసుకుని రూ.4 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఓ వలస కార్మికుడు చేసిన ఫిర్యాదుతో వారి మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, కైతల్ జిల్లాలోని సోలు మజ్రా గ్రామానికి చెందిన బల్వాన్ పింజోర్‌లోని ఓ గోశాలలో పనిచేస్తూ గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్స చేసేవాడు. ఇదే సమయంలో హిమ్‌శిఖా కాలనీకి చెందిన నవ్‌నీత్ కౌర్ తన పెంపుడు కుక్కకు చికిత్స కోసం గోశాలకు వెళ్లడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఫోన్ సంభాషణలతో ప్రారంభమైన పరిచయం ప్రేమగా మారి, కొంతకాలం సహజీవనం చేసిన అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో 2025 జూలై 18న వివాహం చేసుకున్నారు. నవ్‌నీత్‌కు ఇదివరకే వివాహం కాగా, ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
వివాహం తర్వాత మాదకద్రవ్యాల వ్యసనం ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసిందని పోలీసులు తెలిపారు. నవ్‌నీత్ ఇప్పటికే డ్రగ్స్‌కు బానిస కాగా, బల్వాన్‌ను కూడా అదే అలవాటుకు గురిచేసింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన ఈ జంట ప్రతిరోజూ డబ్బు అవసరం కావడంతో ప్రజలను మోసం చేసే పథకాన్ని అమలు చేసింది.
ఈ పథకం ప్రకారం నవ్‌నీత్ రోడ్లపై బైక్‌లు లేదా కార్లలో వెళ్తున్న యువకులను లిఫ్ట్ అడిగేది. ప్రయాణం మధ్యలో వారి ఫోన్ నంబర్లు, డబ్బు తీసుకుని మరుసటి రోజు కలుద్దామని చెప్పి పిలిచేది. బాధితుడు అక్కడికి చేరుకున్న వెంటనే బల్వాన్ వచ్చి, తాను ఆమె భర్తనని పరిచయం చేసుకుని, తన భార్య కనిపించడం లేదంటూ గొడవ సృష్టించేవాడు. అనంతరం ఇద్దరూ కలిసి బాధితుడిని బెదిరించి నగదు, ఆన్‌లైన్ బదిలీల రూపంలో డబ్బు వసూలు చేసేవారు.
సామాజిక పరువు పోతుందనే భయంతో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ జంట దాదాపు 40 మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. వారి ఖాతాల్లోకి సుమారు రూ.4 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
2026 జూన్ 20న ఓ వలస కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం, పంచకులా నుంచి అమరావతికి వెళ్తుండగా నవ్‌నీత్ లిఫ్ట్ అడిగి బైక్‌పై ఎక్కింది. అనంతరం ఆటో ఛార్జీ పేరుతో రూ.50 పంపించమని చెప్పి, తర్వాత మరో చోటికి పిలిపించింది. అక్కడికి వెళ్లగానే బల్వాన్ వచ్చి బెదిరించి, ఏటీఎంకు తీసుకెళ్లి రూ.22 వేల నగదు విత్‌డ్రా చేయించాడు. అనంతరం మొబైల్ ఫోన్, బైక్ లాక్కొని కారులో లోహ్‌గఢ్ ప్రాంతానికి తీసుకెళ్లి బాధితుడిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
ప్రస్తుతం బల్వాన్ పోలీసు రిమాండ్‌లో ఉన్నాడని దర్యాప్తు అధికారి ఏఎస్ఐ విక్రమ్‌జీత్ తెలిపారు. ఈ జంట ఒకే వ్యక్తిని ఎన్నిసార్లు బ్లాక్‌మెయిల్ చేసిందనే అంశంతో పాటు మరిన్ని బాధితులు ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
