AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ.. ఏయే ప్రాంతాల్లో అంటే..

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే, రూట్ మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో అధికారులు ఎలైన్‌మెంట్ గుర్తింపు కోసం ప్రత్యేక మార్కింగ్‌లు చేపడుతున్నారు. సర్వే పూర్తయిన అనంతరం తుది మార్గం, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ.. ఏయే ప్రాంతాల్లో అంటే..
Hyderabad Bullet Train
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2026 | 11:59 AM

Share

హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు.. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు స్టార్ట్ అయ్యాయి. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ల ప్రాజెక్టులో భాగంగా పలు పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్‌ చేస్తున్నాయి. హైదరాబాద్- చెన్నై కారిడార్‌కు శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా సర్వే చేస్తున్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు శంషాబాద్, షాబాద్‌ మండలాలు, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు పది రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు.

యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిస్ గూడం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో మార్కింగ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ ఎలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్‌లు చేస్తున్నట్టు చెబుతున్నారు.

చెన్నై To హైదరాబాద్, హైదరాబాద్ To బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రూట్‌ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్‌మెంట్‌, స్టేషన్లు, భూసేకరణ వివరాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు అధికారులు..

వీడియో చూడండి..

Follow Us
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని..
ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని..
నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఇలా వండితే..
నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఇలా వండితే..