Bro Movie: పవన్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్‌.. ‘బ్రో’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో స్వల్ప మార్పులు. కారణం ఇదే..

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా సినిమా మేకింగ్...

Bro Movie: పవన్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్‌.. బ్రో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో స్వల్ప మార్పులు. కారణం ఇదే..
Bro Movie

Edited By:

Updated on: Jul 25, 2023 | 5:39 PM

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా సినిమా మేకింగ్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.

అంతకు ముందు ప్రకటించినట్లు చిత్ర యూనిట్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈవెంట్‌లో స్వల్ప మార్పులు చేస్తూ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో వర్షం పడుతోన్న క్రమంలో పోలీసుల సూచన మేరకు ఈవెంట్ సమయంలో మార్పులు చేశారు. సాయంత్రం 6 గంటలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చే సమయం కావడం, అప్పుడే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభంకానుండడంతో ఈవెంట్‌ సమయాన్ని మార్చారు.

ఇవి కూడా చదవండి

ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రం రాత్రి 8.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రజల సౌకర్యం, భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడే ట్రాఫిక్‌ విషయాలను పరిగణలోకి తీసుకొని పవర్ ప్యాక్డ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను రాత్రి 8.30 గంటలకు ప్రారంభిస్తున్నాం. దీనిని దృష్టిలో పెట్టుకుని వేదిక దగ్గరకు ఆ సమయానికి రండి’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..