జబర్దస్త్‌తో లింక్.. కటీఫ్ కాదంటున్న హైపర్ ఆది!

జబర్దస్త్‌తో లింక్.. కటీఫ్ కాదంటున్న హైపర్ ఆది!

హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ‘జబర్దస్త్’షోలో తనదైన మార్క్ కామెడీ పంచ్‌లతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతని పంచులు, ప్రాసలకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. అందుకే హైపర్ ఆది స్కిట్‌కు యూట్యూబ్‌లో విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి. అలాంటిది ఆది జబర్దస్త్‌కు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ఆది స్కిట్ రాలేదు. ఓన్లీ ఐదు టీమ్‌లు మాత్రమే ప్రదర్శన […]

Ravi Kiran

|

Aug 25, 2019 | 1:46 PM

హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ‘జబర్దస్త్’షోలో తనదైన మార్క్ కామెడీ పంచ్‌లతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతని పంచులు, ప్రాసలకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. అందుకే హైపర్ ఆది స్కిట్‌కు యూట్యూబ్‌లో విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి. అలాంటిది ఆది జబర్దస్త్‌కు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి.

ఈ గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ఆది స్కిట్ రాలేదు. ఓన్లీ ఐదు టీమ్‌లు మాత్రమే ప్రదర్శన చేశాయి. ఇక ఈ ప్రోగ్రాం ముగిసిన తర్వాత అందరి మదిలో ఆది టీమ్ ఎందుకు పెర్ఫర్మ్ చేయలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది జబర్దస్త్‌కు అతడు దూరం అవుతాడని అంటుంటే.. మరికొందరు అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. ఇక అందరూ అనుకున్నట్లే అవి రూమర్స్ మాత్రమే అనేలా నెక్స్ట్ వీక్ ప్రోమో‌లో ఆది ఎంట్రీ ఇచ్చాడు. జబర్ధస్త్ నిర్వహకులు కూడా ఆది టీమ్.. ఓ ఈవెంట్ చేయడం కోసం విదేశాలకు వెళ్లారని.. అందుకే స్కిట్ చేయలేదని చెప్పారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu