
ఇటీవల సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత నాలుగు నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమ పలువురి దిగ్గజ నటులను కోల్పోయింది. తాజాగా సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్ కన్నుమూశారు. 56 ఏళ్ల వయసున్న ఆయన నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘యంగ్ ట్యాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సహా నటీనటులు, ఆస్ట్రేలియా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా యంగ్ ట్యాలెంట్ టైమ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు బాబీ. చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇలా హఠాత్తుగా కన్నుమూశాడని తెలిసి ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. బాబీ 1966లో ఏప్రిల్ 26న జన్మించారు. నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.1979 నుండి 1983 వరకు యంగ్ టాలెంట్ టైమ్ ప్రోగ్రాంలో రెగ్యులర్ పెర్ఫార్మర్ గా వర్క్ చేశారు బాబీ. దీంతో పాటు నెయిబర్(1985) టీవీ సిరీస్, యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.
కాగా బాబీ హఠాన్మరణంతో ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ‘యంగ్ టాలెంట్ టైమ్ లో మేమంతా కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మా టీమ్ లో ఒకరైన బాబీ మరణించారనే వార్త వినడం బాధాకరంగా ఉంది’ అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరణం తర్వాత కూడా గుర్తుంచుకునే వ్యక్తులలో బాబీ ఒకరని మరొకరు పోస్ట్ షేర్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..