Britney Spears: అమెరికా పాప్ సింగర్ బ్రిట్ని స్పియర్స్ తన తండ్రిని సంరక్షణ స్థానం నుంచి తప్పించాలని కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి వలన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా చెప్పింది. నేను నా జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నాను. గత 13 సంవత్సరాలుగా నా తండ్రి వలన మానసిక క్షోభను అనుభవిస్తున్నాను అంటూ వీడియో లింక్ ద్వారా దాదాపు 20 నిమిషాల పాటు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. అటు బ్రిట్నిస్పియర్స్ అభిమానులు కోర్టు బయట ఆమెకు మద్ధతు పలుకుతూ నినాదాలు చేశారు.
2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ సంరక్షణలో ఉంటుంది. ఆమె ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకుంటున్నా్రు. తాను షాక్ లో ఉన్నానని.. తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆమె న్యాయమూర్తికి తెలిపింది. 13 ఏళ్లు నరకం ఇక చాలు. తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అటు బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వలన ఇబ్బందులు పడుతుందని.. ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని ఆమె అభిమానులు పలు ఛానాళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్రిట్నీ స్పియర్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. గతేడాది.. తన తండ్రి కారణంగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నా అని.. తన సంరక్షణ నుంచి అతన్ని తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. బుధవారం కోర్టు విచారణ చేపట్టింది.
తన తండ్రి వలన బ్రిట్నీ అనేక ఇబ్బందులు పడుతుందని.. వీలైనంత త్వరగా సంరక్షణ బాధ్యతలను రద్దు చేయాలని ఆమె తరపు న్యాయవాది అన్నారు.