Miss Bumbum 2021: తన శరీరంలోని ఓ పార్ట్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్.. ఎక్కడంటే
Miss Bumbum 2021: మనిషి తన జీవితానికే కాదు.. విలువైన వస్తువులు కారులు, బైక్స్ వంటి వస్తువులకు కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారని అందరికీ..
Miss Bumbum 2021: మనిషి తన జీవితానికే కాదు.. విలువైన వస్తువులు కారులు, బైక్స్ వంటి వస్తువులకు కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారని అందరికీ తెలిసిన సంగతే.. అయితే కొంతమంది సెలబ్రెటీలు తమ శరీరంలోని అయవాలు ముక్కు, చెవి, పెదవులు, కాళ్లు, చేతులను కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే బ్రెజిల్ కు చెందిన మోడల్ తన బాడీలోని ఓ పార్ట్ ను ఏకంగా రూ 13 కోట్లకు ఇన్సురెన్స్ చేయించుకుని వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..
బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారా ఈ ఏడాది ‘బుమ్‌బుమ్ 2021 వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. 35 ఏళ్ల బ్రెజిల్ మోడల్ నతీ కిహారా ప్రసవించిన నాలుగు నెలల తర్వాత ఈ అవార్డుకి ఎన్నికైంది. కిహారా కు తన పిరుదులే అందం. తన అందమైన పిరుదుల వల్లనే తను మిస్ గెలుచుకుంది. దీంతో తను వెంటనే ఆ పిరుదులను 1.3 మిలియన్ పౌండ్స్‌కు ఇన్సురెన్స్ చేసింది.
ఈ సందర్భంగా కిహారా మాట్లాడుతూ.. తాను ఫేమస్ అయింది నా పిరుదుల కారణంగా నే. అందుకనే వీటిని ఇన్సురెన్స్ చేయించాలని నిర్ణయించుకున్నా అని చెప్పింది. కిహారా పిరుదులు ప్రస్తుతం బ్రెజిల్‌లోనే అవి పెద్దవి. ప్రస్తుతం అవి 126 సెంటీమీటర్లు ఉన్నాయి. వాటిని త్వరలో 130 సెంటీమీటర్లకు పెంచాలనుకుంటున్నట్లు చెప్పింది.
కిహారాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. మొదట తొమ్మిదేళ్ల బాలుడు. గత కొన్ని నెలల క్రితం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయినప్పటికీ నాథీ మోడల్‌గా రాణిస్తుంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మిస్ బుమ్‌బుమ్ టైటిల్‌ను గెలుచుకుంది. “ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్న చాలా మంది తల్లులకు ప్రాతినిధ్యం వహించడం.. వారిని ప్రోత్సహించడం తనకు దక్కిన గౌరవంఅని చెప్పింది. “నా బట్ పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ తీసుకుంటానని చెప్పింది.