Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ టోపీకి కూడా అంత క్రేజా? వేలంలో ఎన్ని లక్షలకు అమ్ముడు పోయిందో తెలుసా?

|

Sep 27, 2023 | 6:58 PM

మైఖేల్ జాక్సన్ సిగ్నేచర్‌ స్టెప్‌ అయిన మూన్ వాక్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్‌ టు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం ఈ స్టెప్‌ను అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మైకేల్‌ జాక్సన్‌ మూన్‌వాక్‌ స్టెప్‌లో మరో స్పెషాలిటీ అతను ధరించే టోపీ. మైఖేల్ జాక్సన్ మూన్ వాకింగ్, డ్యాన్స్ చేసేటప్పుడు తన టోపీని ముఖానికి అడ్డంగా పెట్టుకునేవాడు. దీని కారణంగా జాక్సన్‌తో పాటు అతని టోపీ కూడా బాగా ఫేమస్‌ అయ్యింది.

Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ టోపీకి కూడా అంత క్రేజా? వేలంలో ఎన్ని లక్షలకు అమ్ముడు పోయిందో తెలుసా?
Michael Jackson
Follow us on

సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువులు ఎంతో ఖరీదైనవి. అయినా వాటిని వేలానికి పెడితే.. ఎంత మొత్తానికైనా కొనేందుకు అభిమానులు ముందుకు వస్తారు. తాజాగా పాప్‌ కింగ్‌, డ్యాన్స్‌ రారాజు ధరించిన టోపీని వేలం వేయగా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. జాక్సన్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ సిగ్నేచర్‌ స్టెప్‌ అయిన మూన్ వాక్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్‌ టు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం ఈ స్టెప్‌ను అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మైకేల్‌ జాక్సన్‌ మూన్‌వాక్‌ స్టెప్‌లో మరో స్పెషాలిటీ అతను ధరించే టోపీ. మైఖేల్ జాక్సన్ మూన్ వాకింగ్, డ్యాన్స్ చేసేటప్పుడు తన టోపీని ముఖానికి అడ్డంగా పెట్టుకునేవాడు. దీని కారణంగా జాక్సన్‌తో పాటు అతని టోపీ కూడా బాగా ఫేమస్‌ అయ్యింది. తాజాగాఈ టోపీని ప్యారిస్‌లో వేలం చేశారు. 77,640 యూరోలకు ఇది అమ్ముడుపోయింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.68లక్షల 22వేలకు పైనే అన్నమాట. కాగా మైఖేల్ జాక్సన్ గిటార్‌ని గతేడాది వేలానికి పెట్టగా ఏకంగా మూడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మొత్తానికి మైఖేల్‌ జాక్సన్‌ ఈ లోకంలో లేకపోయినా అతని క్రేజ్‌ ఏ మాత్ర తగ్గడం లేదంటూ ఈ వేలం ప్రక్రియలు నిరూపిస్తున్నాయి. కాగా గతంలో జాక్సన్ వస్తువులకు సంబంధించి కొన్ని నకిలీల విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అసలు వస్తువుల విలువ అమాంతం పడిపోయింది.

 

ఇవి కూడా చదవండి

ఇక మైఖేల్ జాక్సన్ ఆగస్టు 29, 1958న అమెరికాలో జన్మించారు. పాప్‌ సంగీతం ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. అలాగే అద్భుతమైన డాన్స్‌తో అందరినీ ఉర్రూతలూగించారు. ఇదే సమయంలో మైఖేల్‌ చుట్టూ వివాదాలు చాలానే ఉన్నాయి. అందంగా కనిపించేందుకు చాలా సార్లు తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని, అవి వికటించి 50 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడని చాలామంది చెబుతారు. కాగా ఈ డ్యాన్సింగ్ కింగ్‌పై బయోపిక్‌ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాక్సన్‌ తమ్ముడి కుమారుడు జాఫర్‌ హీరోగా ఇందులో నటించనున్నాడు.  అంటోనియో దర్శకత్వం వహిస్తున్నారు.  మూడుసార్లు ఆస్కార్‌ విజేత జాన్‌ లోగన్‌ ఈ సినిమాకు కథ సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ బయోపిక్ గురించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

జాక్సన్ పాత్రలో ఎవరు నటించనున్నారంటే?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.