AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 2: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అవతార్‌ 2 టికెట్ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే

పదేళ్లకోసారి సినిమా చేసినా పదికాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా చేస్తారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పదులు సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసి ఉండవచ్చు.

Avatar 2: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అవతార్‌ 2 టికెట్ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే
Avatar 2
Basha Shek
|

Updated on: Dec 26, 2022 | 9:07 AM

Share

పదేళ్లకోసారి సినిమా చేసినా పదికాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా చేస్తారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పదులు సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసి ఉండవచ్చు. అయితే అందరికీ గుర్తుండిపోయే సినిమాలు తెరకెక్కించి దిగ్గజ దర్శకునిగా పేరు పొందారు. ది టెర్మినేటర్‌, ర్యాంబో, టైటానిక్‌, అవతార్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాలన్నీ కామెరూన్‌ రూపొందించినవే. తాజాగా అవతార్‌ 2: ద వే ఆఫ్ వాటర్‌ మరో విజువల్‌ వండర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ లెజెండరీ డైరెక్టర్‌. డిసెంబర్ 16 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంగ్లిష్‌తో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ గ్రాండియర్‌ మనదేశంలోనూ మంచి బిజినెస్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అయితే  ఈ హాలీవుడ్ విజువల్ వండర్ టికెట్ల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని చాలాచోట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్‌ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అవతార్‌ 2 త్రీడీ వెర్షన్‌ టికెట్‌ ధరలు తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్‌ టికెట్‌ ధరను సుమారు రూ.150కి తగ్గించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల్లో ఎక్కువగా త్రీడీ వెర్షన్‌నే చూడటానికి ఇష్టపడుతున్నారట. ఇందుకే టికెట్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారట. దీంతో థియేటర్‌కు వచ్చే జనాల సంఖ్య పెరగడంతో పాటు కలెక్షన్లు కూడా పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా 2009లో విడుదలైన అవతార్‌ సినిమాకు సీక్వెల్‌గా అవతార్‌ 2 ను తెరకెక్కించారు జేమ్స్ కామెరూన్‌. అండర్‌ వాటర్‌ టెక్నాలజీ, అత్యాధునిక సాంకేతిక హంగులతో అత్యంత భారీ బడ్జెత్‌త ఈ విజువల్‌ వండర్‌ను తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది అవతార్‌. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..