
ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమలో అనేక మంది అనుహ్యంగా ఈలోకానికి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నటీనటులు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే అవి ఫెయిల్ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో నటుడు ప్లాస్టిక్ సర్జరీ విఫలం కావడంతో కన్నుమూశారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అందంగా ఉంటేనే సినిమా ఛాన్సులు ఎక్కవ..! సినీ పరిశ్రమలో చాలా మంది అందంగా కనిపించేందుకు పలు సర్జరీలు చేయించుకున్నారని మనం వింటూనే ఉంటాం. అయితే ఆ సర్జరీలు కొన్నిసార్లు ప్రాణాలు మీదకు వస్తున్నాయి. అలా ఒక హాలీవుడ్ నటుడు ఏకంగా తన ప్రాణాలనే కోల్పోయాడు. కెనడాకి చెందిన సెయింట్ వాన్ కొలూచి దక్షిణ కొరియాలో మరణించారు. ఈ నటుడు ప్రముఖ BTS గాయకుడు జిమిన్‌లాగా కనిపించేందుకు ఏకంగా 12 సర్జరీలు చేయించుకున్నాడట. చివరకు ఆ కోరిక తీరుకుండానే కన్నుమూశారు.
కెనడాకు చెందిన సెయింట్ వాన్ కొలూస్సీ వయసు 22. అతనికి దక్షిణా కొరియా మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ అంటే పిచ్చి. ముఖ్యంగా అందులోని జిమిన్ అంటే విపరీతమైన అభిమానం. అతడిలా కనిపించాలనుకున్నాడు. అందుకు ఏకంగా 2,20,000 డాలర్లు అంటే దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేసి ముఖం, ముక్కు, కన్ను సహా 12 సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్జరీలు వల్ల కలిగిన ఇన్‌ఫెక్షన్ వలెనే సెయింట్ వాన్ 22 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పుయినట్లు సమాచారం. సర్జరీలో భాగంగా ఏప్రిల్ 22 తన దవడకు అమర్చిన ఇంప్లాంట్స్ తొలిగించడం జరిగింది. అయితే ఆ సర్జరీ అయిన కొన్ని గంటలోనే ఇన్‌ఫెక్షన్ సోకి సెయింట్ వాన్ ఊపిరి వదిలాడు. ఈ విషయాన్ని కెనడా నటుడి పీఆర్వో ఎరిక్ బ్లేక్ వెల్లడించారు.
దీంతో హాలీవుడ్‌ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. సెయింట్ వాన్ 2019లో కెనడా నుంచి సౌత్ కొరియాకు వెళ్లాడని.. అక్కడ కొరియన్స్ తరహా ముఖాకృతిలోకి తన ముఖాన్ని మార్చుకోవడం పై దృష్టి పెట్టాడట. తాను ఎంతో ఇష్టపడే జిమిన్ లా కనిపించాలనే కోరికతో సర్జరీలు చేయించుకున్నాడట పాప్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కొరియా చేరుకున్న సెయింట్ వాన్.. ఇప్పుడు ఇలా ప్రాణాలు వదలడం అందర్నీ బాధిస్తుంది.