AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎడ్ ఎ మమ్మా’ స్టార్టప్ లాంచ్ చేసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్.. పిల్లల కోసమే ప్రత్యేకంగా దుస్తులు..

అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అలియాభట్. తాజాగా ఎంటర్‏ప్రెన్యూర్ పాత్రలోకి అడుగుపెట్టింది.

'ఎడ్ ఎ మమ్మా' స్టార్టప్ లాంచ్ చేసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్.. పిల్లల కోసమే ప్రత్యేకంగా దుస్తులు..
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2020 | 11:39 AM

Share

అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అలియాభట్. తాజాగా ఎంటర్‏ప్రెన్యూర్ పాత్రలోకి అడుగుపెట్టింది. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల దుస్తుల కోసం ‘ఎడ్ ఎ మమ్మా’ అనే స్టార్టప్ లాంచే చేసింది ఈ ముద్దుగుమ్మా. ప్రధాని నినాదించిన వోకల్ ఫర్ లోకత్‏లో భాగంగా ఈ స్టార్టప్ మొదలు పెట్టింది.

అలియా మొదలు పెట్టిన ఈ స్టార్టప్ ప్రత్యేకత నేచురల్ ఫ్యాబ్రిక్స్. ప్లాస్టిక్‏తో తయారుచేసిన బటన్స్‏ను ఇందులో ఉపయోగించరు. ఎడ్ ఎ మమ్మా ద్వారా ప్రకృతిని కాపాడాలని అలియా ఆలోచన అనేట్టుగా ఉంది. ఎడ్ ఎ మమ్మా స్టోర్ల సంఖ్య పెంచడంతోపాటు పిల్లల పుస్తకాల ద్వారా స్టోరీలు కూడా చెప్పనున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ప్రకృతికి సంబంధించిన కథలను పిల్లలు చెప్పబోతుంది. ప్రతి గార్మెంట్ ఒక కథ చెబుతుంది. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతుంది అనేది అలియా మాట.

Follow Us