Prabhas: ‘అందుకే నాకింకా పెళ్లి కాలేదేమో’.. రాధేశ్యామ్‌ ఈవెంట్‌ లో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ప్రభాస్‌..

డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas). పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్‌ (Radhe shyam) మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas: 'అందుకే నాకింకా పెళ్లి కాలేదేమో'.. రాధేశ్యామ్‌ ఈవెంట్‌ లో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ప్రభాస్‌..
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2022 | 7:50 AM

డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas). పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్‌ (Radhe shyam) మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యాడు ప్రభాస్‌. ఇందులో భాగంగా నిన్న (మార్చి3) ముంబైలో రాధేశ్యామ్‌ రిలీజ్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ప్రభాస్‌, పూజా హెగ్డేతో పాటు చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ ఈ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. రాధేశ్యామ్‌లో సినిమాలో ప్రభాస్​ విక్రమాదిత్య పాత్రలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది.

జాతకాలు చూపించుకున్న ప్రభాస్‌, పూజ..

కాగా నిన్న విడుదలైన ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్‌ తప్పు’ అని పూజ నోటి నుంచి ఒక డైలాగ్‌ వినిపిస్తుంది. దీనిని గుర్తు చేస్తూ ఓ జర్నలిస్ట్‌ ‘మీ రియల్‌ లైఫ్‌లో కూడా అలా ప్రేమ విషయంలో లెక్క తప్పిందా?’ అంటూ ప్రభాస్‌ను అడిగారు. దీనికి స్పందించిన డార్లింగ్‌ ‘ ‘ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక రిలీజ్‌ ట్రైలర్‌ ఈవెంట్‌లో భాగంగా ప్రభాస్‌, పూజ జాతకాలు చూపించుకున్నారు. ఆస్ట్రాలజీ కార్నర్‌లో హస్తసాముద్రికా నిపుణుడితో వీరు జాతకం చెప్పించుకుంటోన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్‌ వైరల్‌గా మారాయి.

Also Read:BCCI: కోహ్లీ ఫ్రెండ్‌కు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. పుజారా, రహనేలు కూడా డిమోట్.!

Hyderabad: బైక్ రేసింగ్‌లతో యువకుల హల్‌చల్‌.. భాగ్యనగరంలో 8 మంది అరెస్టు

Mega-Yacht Seize: ఉక్రెయిన్ లో రెచ్చిపోతున్న రష్యాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జర్మనీ.. పూర్తి వివరాలు