BCCI: కోహ్లీ ఫ్రెండ్‌కు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. పుజారా, రహనేలు కూడా డిమోట్.!

టీమిండియా వార్షిక కాంట్రాక్ట్‌ లిస్ట్‌ ప్రకటించింది బీసీసీఐ. నిన్న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆటగాళ్ల గ్రేడ్లపై చర్చ జరిగింది...

BCCI: కోహ్లీ ఫ్రెండ్‌కు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. పుజారా, రహనేలు కూడా డిమోట్.!
Bcci Central Contracts
Follow us

|

Updated on: Mar 03, 2022 | 7:43 AM

టీమిండియా వార్షిక కాంట్రాక్ట్‌ లిస్ట్‌ ప్రకటించింది బీసీసీఐ. నిన్న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆటగాళ్ల గ్రేడ్లపై చర్చ జరిగింది. కొందరి గ్రేడ్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా, టెస్టు ఫార్మాట్ మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గతేడాది వరకు వీరిద్దరూ ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్ల కేటగిరీలో ఉన్నారు. పుజారా, రహానె ఇద్దరూ గత కొద్ది కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్నారు. దీంతో మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరినీ పక్కన బెట్టారు. దీంతో వారు రెగ్యులర్‌ క్రికెటర్ల జాబితాలో లేకుండాపోయారు. ఫలితంగా గ్రేడింగ్‌ కూడా తగ్గింది.

అటు సీనియర్‌ పేస్‌ బౌలర్ ఇషాంత్‌ శర్మ గ్రేడ్‌ కూడా ఏ నుంచి బీకి పడిపోయింది. ఇక వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఏకంగా ‘ఎ’ గ్రేడ్‌ నుంచి ‘సి’ గ్రేడ్‌కి పడిపోయాడు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం ‘సి’ గ్రేడ్‌లో ఉన్నాడు. సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్ సాహా, మయాంక్‌ అగర్వాల్‌ ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌లోకి వెళ్లిపోయారు. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను బీసీసీఐ నాలుగు కేటగిరీలుగా విభజించింది. వీరిలో ‘ఎ+’ ఆటగాళ్లకు సంవత్సానికి రూ.7 కోట్లు, ఎ, బి, సి కేటగిరీ ఆటగాళ్లకు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, కోటి రూపాయలను బీసీసీఐ చెల్లిస్తుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రిత్‌ బుమ్రా ప్రస్తుతం ఎ+ గ్రేడ్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్‌, జడేజా, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీ ‘ఎ’గ్రేడ్‌లో ఉన్నారు. గతంలో ‘ఎ’ గ్రేడ్‌లో 10 మంది ఆటగాళ్లకు చోటుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు ఐదుకే పరిమితం చేశారు. మొత్తం 27 మందితో బీసీసీఐ యాన్యువల్‌ కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. గతేడాది 28 మందికి అవకాశం ఇచ్చింది. నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌ను కాంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగించారు.