Shreyas Iyer: టీ20 ర్యాకింగ్స్ టాప్ 20లోకి శ్రేయాస్ అయ్యర్.. టాప్ 10లో స్థానం కోల్పోయిన విరాట్ కోహ్లీ..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్(t20 rankings)లో శ్రేయాస్ అయ్యర్(shreyas iyer )కు టాప్ 20లోకి చేరాడు....
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్(t20 rankings)లో శ్రేయాస్ అయ్యర్(shreyas iyer ) టాప్ 20లోకి చేరాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో 27 స్థానాలు ఎగబాకాడు. శ్రేయాస్ అయ్యర్ టీ 20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(విరాట్ కోహ్లీ) స్థానం కోల్పోయాడు. అతను శ్రీలంకతో సిరీస్‌లో ఆడలేదు. కోహ్లీ 10వ స్థానం నుంచి 15 వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను ఓడించింది. ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ 174 స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులు చేశాడు.
❇️ Kagiso Rabada in top 3 Test bowlers ❇️ Colin de Grandhomme moves up in Test all-rounders’ list
Full rankings ➡️ https://t.co/saWOSRZ2py pic.twitter.com/ZQodsgwBpo
— ICC (@ICC) March 2, 2022
మరోవైపు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు స్థానాలు ఎగబాకాడు. అతను ఇప్పుడు 17వ ర్యాంక్‌లో ఉన్నారు. సిరీస్‌లో శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిసంక 75 పరుగులు చేశాడు. దీంతో ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన లహిరు కుమార తొలిసారిగా టాప్ 40 బౌలర్లలోకి ప్రవేశించాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రబడ 10 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్ ఐదో స్థానానికి, టిమ్ సౌథీ ఆరో స్థానానికి పడిపోయారు.
వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ 10 బౌలర్ల జాబితాలో తన స్థానాన్ని తిరిగి పొందాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌లో ఉండగా, బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ ఏడో స్థానానికి పడిపోయాడు. శ్రీలంకకు చెందిన లిటన్ దాస్ 32వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బ్యాట్స్‌మెన్‌లో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
? Rashid Khan breaks into top 10 ODI bowlers ? Pathum Nissanka moves to No.9 in T20I batters’ list
Full rankings ➡️ https://t.co/saWOSRZ2py pic.twitter.com/UUXbK8RDme
— ICC (@ICC) March 2, 2022
Read Also.. ICC Women World Cup 2022: పదకొండు సార్లు టోర్ని జరిగితే కేవలం 3 జట్లు మాత్రమే గెలుపొందాయి..!