Actress Meena: మీనా కూతురిని చూశారా.. ? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మీనా. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో చురుగ్గా ఉన్న మీనా.. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మీనా చాలా యాక్టివ్.

Actress Meena: మీనా కూతురిని చూశారా.. ? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..
Meena

Updated on: Feb 26, 2025 | 10:39 AM

అందాల నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత అందం, అభినయంతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సౌందర్యంతో ఇప్పటికీ వెండితెరపై ఆకట్టుకుంటున్నారు మీనా. 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా..చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టాప్ హీరోలకు జోడిగా నటించి మెప్పించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. కమల్ హాసన్, రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్నారు మీనా. వీరికి 2011లో నైనికా అనే అమ్మాయి జన్మించింది.

2022లో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటుంది మీనా. ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా కనిపిస్తుంది. మీనా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 40 ఏళ్లు దాటిపోయింది. ఈ సందర్భంగా ఆమెకు చెన్నైలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం సైతం ఏర్పాటు చేసి మీనాను గౌరవించారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న మీనా.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. అలాగే తన కూతురి ఫోటోస్ సైతం పంచుకుంటుంది.

తాజాగా మీనా కూతురు ఫోటోస్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లిలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ హీరోగా నటించిన పోలీసోడు సినిమాలో అతడి కూతురిగా కనిపించింది మీనా కూతురు. ఆ త్రవాత భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో అరవింద్ స్వామితోనూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

Meena Daughter

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..