Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రిలీజ్‌కు ముందే కెరీర్ బెస్ట్ రికార్డు సృష్టించిన మహేష్ బాబు..!

సంక్రాంతి సినిమాల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక.. నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ గురూజీ చేసిన సినిమా ఇది.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రిలీజ్‌కు ముందే కెరీర్ బెస్ట్ రికార్డు సృష్టించిన మహేష్ బాబు..!
Guntur Kaaram

Edited By:

Updated on: Jan 11, 2024 | 3:00 PM

సంక్రాంతి సినిమాల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక.. నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ గురూజీ చేసిన సినిమా ఇది. మరోవైపు మహేష్ బాబు కూడా వరసగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట అన్ని సినిమాలు బాగానే ఆడాయి. కొన్ని అబౌ యావరేజ్ దగ్గర ఆగినా.. మరికొన్ని మాత్రం బాగానే దున్నేసాయి. ఇప్పుడు గుంటూరు కారం అంటూ పక్కా మాస్ సినిమాతో వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. మహేష్ కెరీర్‌లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. సర్కారు వారి పాట రూ.118 కోట్లు చేస్తే.. దీనికి మరో రూ.18 కోట్లు అదనంగానే జరిగింది. మరి ఈ ప్రీ రిలీజ్ లెక్కలేంటి.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది చూద్దాం..

నైజాం: 42 కోట్లు

సీడెడ్: 13.75 కోట్లు

ఉత్తరాంధ్ర: 14 కోట్లు

ఈస్ట్: 8.6 కోట్లు

వెస్ట్: 6.5 కోట్లు

గుంటూరు: 7.65 కోట్లు

కృష్ణా: 6.50 కోట్లు

నెల్లూరు: 4 కోట్లు

ఏపీ, తెలంగాణ ప్రీ రిలీజ్ బిజినెస్: 102.00 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 9 కోట్లు

ఓవర్సీస్: 20 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 132.00 కోట్లు

రూ.132 కోట్ల వరకు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో.. రూ. 135 కోట్లు వస్తే హిట్ అయినట్లు లెక్క. ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే కచ్చితంగా గుంటూరు కారం టార్గెట్ రీచ్ అయ్యేలాగే కనిపిస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం గుంటూరు కారం దెబ్బకు ఇండస్ట్రీ రూపు రేఖలు మారిపోవడం అయితే ఖాయం. చూడాలిక.. ఏం జరుగుతుందో..?