AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటల మాంత్రికుడి ఇంట్లో కూడానా..!

టాలీవుడ్‌లో జీఎస్టీ సోదాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నును ఎగవేశారన్న కారణాలతో టాలీవుడ్‌కు చెందిన పలువురి ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొన్నటికి మొన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై అధికారులు దాడులు చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన అకౌంట్లను చెక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంట్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. […]

మాటల మాంత్రికుడి ఇంట్లో కూడానా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 6:19 PM

Share

టాలీవుడ్‌లో జీఎస్టీ సోదాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నును ఎగవేశారన్న కారణాలతో టాలీవుడ్‌కు చెందిన పలువురి ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొన్నటికి మొన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై అధికారులు దాడులు చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన అకౌంట్లను చెక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంట్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ స్నేహితుడు, నిర్మాత రాధాకృష్ణ నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మంట్స్ ఆఫీసుల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.

కాగా జీఎస్టీ అధికారులు బుధవారం యాంకర్ అనసూయకు షాక్ ఇచ్చారు. రూ.55లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. త్వరలో మరికొందరికి కూడా ఈ నోటీసులు వెల్లనున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ స్థానికంగా ఉన్న వ్యాపారస్థులు, ఫైనాన్స్ సంస్థలు, బిల్డర్స్, దర్శకనిర్మాతలకు చెందిన 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలను చూపి చెల్లించాల్సిన జీఎస్టీని చెల్లించకుండా వీరు ఎగవేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమర్పించిన పత్రాలు, చెల్లించిన మొత్తం సరైనవేనా..? అన్న సందేహంతోనే అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్-100 లిస్ట్‌లో త్రివిక్రమ్ 77వ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్, మహేష్ బాబు తరువాత టాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో