గోపీచంద్, మారుతీల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్ డేట్.. టైటిల్ చెప్పే సమయం వచ్చేసిందంటున్న యూనిట్..

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

గోపీచంద్, మారుతీల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్ డేట్.. టైటిల్ చెప్పే సమయం వచ్చేసిందంటున్న యూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 14, 2021 | 6:50 AM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో కుర్చీలో ఓ ఖర్చీఫ్‌ వేస్తున్న ఫొటోను షేర్‌ చేసి అక్టోబర్‌ 1న సినిమా విడుదల అని ఓ సినిమా ప్రచారాన్ని చిత్ర యూనిట్‌ వినూత్నంగా చేపట్టింది. ఈ సినిమా ఎవరిది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో గోపీ చంద్‌ ఒక క్రిమినల్‌ లాయర్‌గా నటించనున్నాడు. ఇక సినిమా షూటింగ్‌ను మార్చిలో మొదలు పెడతామని చెప్పిన చిత్ర యూనిట్‌ విడుదల తేదీ (అక్టోబర్‌ 1) విషయంలో మాత్రం అదే పట్టుదలతో ఉన్నారు. అసలు షూటింగ్‌ మొదలుకాక ముందే విడుదల తేదీని ఎలా ప్రకటించారంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఎంటీ అనేది మాత్రం వెల్లడించలేదు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర యూనిట్‌ మరో పోస్టర్‌ను విడుదల చేసింది.

మారుతీ, గోపీచంద్ కాంబోలో రాబోతున్న సినిమా ఈరోజు పూజా కార్యక్రమంతో టైటిల్ రివీల్ చేస్తున్నట్లుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఇక ఎప్పటిలాగే ఆ పోస్టర్ వినూత్నంగా డిజైన్ చేశారు. ఆ పోస్టర్లో కమర్షియల్ అనే పదాన్ని హైలెట్ చేస్తూ.. ఈరోజు ఉదయం 8 గంటల30 నిమిషాలకు ఈ మూవీ టైటిల్ విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:

Vijay Devarakonda: ముంబైలో స్టైలిష్‌గా ల్యాండ్ అయిన ‘లైగర్‘.. వైరల్‌గా విజయ్ దేవరకొండ ఫొటోలు..