Keerthy Suresh wedding Bells: టాప్ సంగీత దర్శకుడి ప్రేమలో కీర్తి.. త్వరలో మహానటి పెళ్లి అంటూ వార్తలు.. ఫోటోలు వైరల్
అతడేమో.. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తుంటాడు.. ఆమె ఏమో.. అరవిరిసిన నవ్వుతో అందరినీ కట్టిపడేస్తుంది. అతడేమో.. పాటలు పాడుతూ తెర వెనుక ఉంటే.. ఆమె ఏమో.. అదే పాటకు డ్యాన్స్ చేస్తూ.. తెరపై మెరుస్తుంటుంది. ఇలాంటి ఈ కాంబో నిజజీవితంలో వివాహ బంధంతో ఒక్కటైతే ఎలా ఉంటుందంటే...
Keerthy Suresh wedding Bells: అతడేమో.. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తుంటాడు.. ఆమె ఏమో.. అరవిరిసిన నవ్వుతో అందరినీ కట్టిపడేస్తుంది. అతడేమో.. పాటలు పాడుతూ తెర వెనుక ఉంటే.. ఆమె ఏమో.. అదే పాటకు డ్యాన్స్ చేస్తూ.. తెరపై మెరుస్తుంటుంది. ఇలాంటి ఈ కాంబో నిజజీవితంలో వివాహ బంధంతో ఒక్కటైతే ఎలా ఉంటుందంటే.. కీర్తి సురేష్, అనిరుద్ జంటలా ఉంటుంది.
అవును.. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంత కాలంగా కీర్తి అనిరుద్ తో డేటింగ్‌లో ఉందని.. ఇక తాజాగా ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యేందుకు రెడీ అవుతున్నరనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే కీర్తి సురేష్ పెళ్లి పై రూమర్లు రావడం ఇదేం మొదటి సారి కాదు.. ఇంతకు ముందే ఓ బిజినెస్ మ్యాన్ తో కీర్తి ఎంగేజ్ మెంట్ అయిందని న్యూస్ రాగా.. ఆ తరువాత ఓ బీజేపీ నాయకుడి కొడుకుతో పెళ్లి కి అంతా సిద్దమంటూ.. మరో రూమర్ వచ్చి హంగామా చేసింది. ఇలా రూమర్లు మహానటి పెళ్లి చుట్టూనే తిరిగాయి.
ఇలా ఓ వైపు కీర్తి సురేష్ వివాహం అంటూ సందడి చేసేస్తుంటే.. తను మాత్రం ఇదేమీ తనకు పట్టనట్లు కూల్ గా సినిమాలను చేసుకుంటుంది. ఇప్పటికే సన్నబడి సరికెత్త లుక్లోకి మారిన కీర్తి.. మహేష్ సర్కారీ పాటలో ఛాన్స్ కొట్టేసి.. దుబాయ్‌లో మహేష్‌తో ఆడిపాడుతోంది. ఈ ఒక్క సినిమానే కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు లైన్లో పెట్టి బిజీబిజీగా ఉందీ అమ్మడు. మరోవైపు అనిరుద్ ప్రముఖ గాయని జోనీతాగాంధీ ప్రేమలో మునిగితేలుతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్లి ఊహాగానాలపై కీర్తి సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి
Also Read: