ప్రేమ అయోమయంగా ఉంది.. తోడు కోసం వెతుకుతూనే ఉన్నా.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
09 October 2026
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేమ, పెళ్లి, బంధాల నిర్వచనం పూర్తిగా మారిపోయింది. డేటింగ్ యాప్‌ల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయడంపై హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి స్పందించింది.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. నేటి తరం డేటింగ్ సంస్కృతిపై మాట్లాడుతూ ఇప్పటి రోజుల్లో డేటింగ్ యాప్‌ల వల్ల ప్రేమ అనేది చాలా అయోమయంగా ఉంది.
ఒకరితో బంధంలో ఉంటూనే, మరో ఆప్షన్ కోసం యాప్‌లలో వెతుక్కోవడం నన్ను తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎదుటి వ్యక్తి పట్ల నిజమైన కట్టుబాటు ఉండట్లేదు అని అన్నారు.
ఎవరైనా నచ్చకపోతే వెంటనే మరొకరిని వెతుక్కునే వెసులుబాటు ఉండటం వల్ల, సమస్యలను కూర్చుని పరిష్కరించుకునే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. ఇది నిజమైన ప్రేమకు ఏమాత్రం మంచిది కాదు అని అన్నారు.
చేతిలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉండటం వల్లే మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు.
ఇదిలా ఉంటే పెళ్లి గురించి గత కొంతకాలంగా ఆలోచిస్తున్నా.. కొన్ని కారణాల రీత్యా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పాతికేళ్ల వయసు నుంచే తాను పెళ్లి కోసం.. కాబోయే భర్త కోసం ఆలోచించానని చెప్పుకొచ్చింది. కానీ నాకు తెలిసిన కొందరు పెళ్లయిన తర్వాత ఎలా ఉన్నారో చూశానని తెలిపింది.
ఒకరిద్దరు తప్పించి చాలా మంది సంతోషంగా లేరు. పెళ్లి కారణంగా వారు జీవితంలో ఎదగలేకపోతున్నారని తెలిపింది. తాను కూడా గతంలో నమ్మకద్రోహానికి గురయ్యానని తెలిపింది.