Radhe Shyam Movie: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేసింది.. ఇక పండగే..
Radhe Shyam Movie: ప్రేమికుల రోజున ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూ్స్ వచ్చేసింది. ప్రభాస్
Radhe Shyam Movie: ప్రేమికుల రోజున ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూ్స్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా పూజాహెగ్డె హీరోయిన్‌గా నటించిన ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘డార్లింగ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘రాధేశ్యామ్’కు కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల తర్వాత ఇందులో ప్రభాస్ లవర్‌బాయ్‌గా సాఫ్ట్ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..