Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ అసలు పేరేంటో తెలుసా.? తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

Ram Gopal Varma: సంచలనం ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌ గోపాల్‌ వర్మ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ తిండి లేకుండా అయినా బతుకుతాడేమో కానీ కాంట్రవర్సీ లేకుండా మాత్రం...

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ అసలు పేరేంటో తెలుసా.? తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
Ram Gopal Varma
Follow us

|

Updated on: Jun 22, 2022 | 8:00 AM

Ram Gopal Varma: సంచలనం ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌ గోపాల్‌ వర్మ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ తిండి లేకుండా అయినా బతుకుతాడేమో కానీ కాంట్రవర్సీ లేకుండా మాత్రం బతకలేరు. తీసే సినిమాల నుంచి మాట్లాడే విధానం వరకు ప్రతీదాంట్లో వర్మ మార్క్‌ ఉండాల్సిందే. ఇక వర్మను ఎంత మంది విమర్శించే వారు ఉంటారో అంతే స్థాయిలో పొగిడే వారు కూడా ఉంటారు. సమాజంలో జరిగే అంశాలను సినిమా కథాంశంగా తీసుకొని నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ.

ఈ క్రమంలోనే తాజాగా కొండ మూరళి, సురేఖ జీవిత కథ ఆధారంగా వర్మ ‘కొండా’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది. వర్మ సైతం ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా బెజవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. ఇక కొండ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

దేవుడిని పెద్దగా నమ్మని వర్మ పేరులో ‘రాముడు, గోపాలుడు’ పేర్లు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. నిజానికి తన అసలు పేరు ‘రామ్‌ పండు’ అని, స్కూల్‌లో అందరూ ఆ పేరు విని ఏడిపిస్తారని చివరి క్షణంలో ఆయన నాన్న ‘రామ్‌ గోపాల్‌ వర్మ’గా మార్చారని వర్మ చెప్పుకొచ్చారు. తన పేరును మార్చుకోవాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు వర్మ. ఇలా తన కెరీర్‌లో తొలిసారి తన అసలు పేరు చెప్పి వర్మ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles