Tollywood: ‘నేనింతే’ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది.. ఏం చేస్తోందో తెలుసా?

2008లో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన 'నేనింతే' మూవీ మీ అందరికీ గుర్తుండొచ్చు..

Tollywood: నేనింతే మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది.. ఏం చేస్తోందో తెలుసా?
Aditi Gautam

Updated on: Jan 15, 2023 | 7:55 PM

2008లో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనింతే’ మూవీ మీ అందరికీ గుర్తుండొచ్చు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సియా గౌతమ్. ఆమె అసలు పేరు అదితి గౌతమ్ కాగా.. సియా గౌతమ్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ మూవీలో సంధ్య అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ చిత్రంలో నటించింది సియా గౌతమ్. అయితే ఆ సినిమా సక్సెస్ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టలేదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడంతో ‘వేదం’ తర్వాత సియా గౌతమ్ మళ్లీ తెలుగులో కనిపించలేదు.

అయితే 2011లో కన్నడంలో ఓ సినిమా చేసిన సియాకు.. సుమారు 7 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ‘సంజూ’ మూవీ రూపంలో ఛాన్స్ దొరికింది. దీని తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం మానేశాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తోన్న ఈ భామ.. ప్రస్తుతం తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తోంది. అలాగే ముంబైలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. అక్కడే వాళ్ల అన్నయ్యకు సంబంధించిన బిజినెస్‌లు కూడా చూసుకుంటోంది. మరోవైపు ఖాళీ దొరికనప్పుడల్లా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది గోపీచంద్ హీరోగా వచ్చిన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది.

Follow Us