AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

ప్రస్తుతం యావత్ ఇండియా దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు కోలీవుడ్ హీరో విజయ్ తలపతి. కేవలం సొంతంగా పార్టీ ప్రారంభించిన రెండేళ్లలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి తమిళనాడు సీఎంగా మారబోతున్నాడు. దీంతో విజయ్ సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే ముఖ్యంగా నెట్టిటం హాట్ టాపిక్ అవుతున్నారు విజయ్ భార్య సంగీత. ఎన్నికలకు ముందు విడాకులు అంటూ అటు విజయ్ కు.. ఇటు అభిమానులకు పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..
Vijay, Sangeetha
Rajitha Chanti
|

Updated on: May 06, 2026 | 8:00 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు విజయ్ తలపతి. టీవీకే పార్టీని స్థాపించి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా 108 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయ్ ముఖ్యమంత్రిగా మారబోతున్నారు. దీంతో విజయ్ గురించి.. ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి యావత్ దేశమంతా తెగ ఆసక్తి చూపిస్తుంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే విజయ్ పర్సనల్ లైఫ్ సవాళ్లతో నిండి ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విడాకులు అంటూ పెద్ద షాకిచ్చింది విజయ్ సతీమణి సంగీత. ఈ వార్త తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత, వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

ప్రస్తుతం విజయ్ ప్రేమకథ నెట్టింట వైరలవుతుంది. సంగీత స్వర్ణలింగం.. లండన్‌లో పెరిగిన, శ్రీలంక వ్యాపారవేత్త కుమార్తె. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత కుమార్తె. విజయ్ నటించిన ‘పూవే ఉనక్కగా’ సినిమా చూసిన తర్వాత ఆమె విజయ్ వీరాభిమానిగా మారిపోయింది. దీంతో ఎవరికి తెలియకుండా ఇండియా వచ్చి విజయ్ ను అభినందించింది. పూవే ఉనక్కాగా అంటే “ఈ పువ్వు నీ కోసమే” అని అర్థం. ఇది 1996లో విజయ్ కథానాయకుడిగా నటించిన ఒక తమిళ చిత్రం. ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం .దీనిని ఆర్.బి. చౌదరి నిర్మించారు. విజయ్, సంగీత ప్రధాన పాత్రలు పోషించగా.. ఈమూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. తమిళనాడులో ఏకంగా 270 రోజులు ఆడింది.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

విజయ్ సినిమాలు చూస్తూ అభిమానిగా మారిన సంగీత స్వర్ణలింగం.. ఆమె లండన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు క్రమం తప్పకుండా విజయ్‌కి ఉత్తరాలు రాసేది. వారిద్దరూ కలుసుకుని, స్నేహితులై, చివరికి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం విజయ్ తనయుడు దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

Follow Us