AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Naveen: చూడ్డానికి ముసలోడిలా కనిపిస్తాడు కానీ.. జబర్దస్త్ నవీన్ వయసు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో గడ్డం నవీన్ కూడా ఒకరు. తన వేషధారణతో, కామెడీ డైలాగులతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరవయ్యారాయన. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారీ జూనియర్ రాఘవేంద్ర రావు.

Jabardasth Naveen: చూడ్డానికి ముసలోడిలా కనిపిస్తాడు కానీ.. జబర్దస్త్ నవీన్ వయసు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?
Jabardasth Naveen
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 9:41 PM

Share

జబర్దస్త్ నవీన్ అలియాస్ గడ్డం నవీన్.. జబర్దస్త కామెడీ షో చూసే వారికి ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. అందులో అభి, రాముతో కలిసి నవీన్ చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లోనూ వీరి జబర్దస్త్ వీడియోలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో పెద్దగా కనిపించం లేదు నవీన్. అదే సమయంలో సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. కాగా భారీ కాయం, తెల్లటి గడ్డంతో తాతలా కనిపించే జబర్దస్త్ నవీన్ ను చూస్తే ఆయన వయసు చాలా ఎక్కువగా ఉందనుకుంటారు చాలా మంది. కనీసం 60కు పైనే ఉంటుందని అంచనా వేస్తారు. అయితే మీరు కూడా అలా అనుకుంటే పొరపాటే. జబర్దస్త్ నవీన్ వయసు కనీసం 50 కూడా దాటలేదు. 2020లో ఒక సందర్భంలో తన వయసు గురించి మాట్లాడిన నవీన్ తనకు కేవలం 43 మాత్రమే నని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 49 ఏళ్లు అన్నమాట.

నవీన్ 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అప్పట్లో ఒత్తైన జుట్టుతో.. సూపర్ హెయిర్ స్టైల్‌తో నిజంగానే స్టార్ హీరోలా కనిపించేవాడు నవీన్. అయితే సినిమాల్లో ఎక్కువగా ఆయనకు సైడ్ క్యారెక్టర్ రోల్స్ రావడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. రామసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, నాగ, బ్యాడ్ బాయ్స్ తదితర హిట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు నవీన్. ఎక్కువగా విలన్ గ్యాంగ్స్ లోనే కనిపించేవారాయన. దీంతో పెద్దగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు నవీన్. దీనికి తోడు చాలా తక్కువ సమయంలోనే వెంట్రుకలన్నీ ఊడిపోయాయని, అందుకే మరీ పెద్ద వయస్కుడిలా కనిపిస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు నవీన్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

కాగా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. కమెడియన్ గా, సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. దీంతో పాటు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. ఆ మధ్యన తన తోటి కమెడియన్, టీమ్ లీడర్ అదిరే అభి హీరోగా పాయింట్ బ్లాంక్ సినిమా నిర్మించారు.

జబర్దస్త్ నవీన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే
పెళ్లిలో కాల్పుల కలకలం.. నాలుగేళ్లకు బయటపడ్డ వీడియో!
పెళ్లిలో కాల్పుల కలకలం.. నాలుగేళ్లకు బయటపడ్డ వీడియో!
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 రకాల సూప్‌లు మీ డైట్‌లో చేర్చండి..
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 రకాల సూప్‌లు మీ డైట్‌లో చేర్చండి..
5ఏళ్ల తర్వాత కొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి ఎస్‌యూవీ
5ఏళ్ల తర్వాత కొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి ఎస్‌యూవీ
బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా?
బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా?