AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhakar : ఆ హీరో నేను రూమ్‏మేట్స్.. నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి ఏమన్నారంటే.. నటుడు సుధాకర్..

టాలీవుడ్ నటుడు బి. సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా, తర్వాత సహయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వూలో తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగంలో తన అనుభవాలను పంచుకున్నారు. కోమాలో ఉన్నప్పుడు దేవుని దయ వల్ల తిరిగి కోలుకున్నానని, ఎందరో ప్రార్థనలు తనను నిలబెట్టాయని ఆయన తెలిపారు.

Sudhakar : ఆ హీరో నేను రూమ్‏మేట్స్.. నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి ఏమన్నారంటే.. నటుడు సుధాకర్..
Sudhakar
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 9:05 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణమైన శైలి, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హాస్య నటుడు బి. సుధాకర్. తెలుగు, తమిళంలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత సహాయ నటుడిగానే కాకుండా విలన్ పాత్రలతోనూ మెప్పించారు. అలాగే తెలుగులో పాపులర్ హాస్యనటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుధాకర్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్య పరిస్థితి, సినీ ప్రయాణం, తోటి నటీనటులతో ఉన్న అనుబంధం రీఎంట్రీ ఆలోచనల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన అనారోగ్యం, సినిమాల గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఆత్మీయతను గుర్తుచేసుకుంటూ, తాను హాస్పిటల్‌లో కోమాలో ఉన్నప్పుడు చిరంజీవి గారు తన కుటుంబంతో సహా వచ్చి పరామర్శించారని చెప్పారు. అలాగే కోటి, జగపతిబాబు, తనికెళ్ల భరణి వంటి పలువురు సినీ ప్రముఖులు వచ్చి ధైర్యం చెప్పారని తెలిపారు. తన కుమారుడి ఇంజనీరింగ్ సీటు విషయంలో సహాయం కోరడానికి వెళ్లినప్పుడు చిరంజీవి ఎంతో ఆప్యాయంగా స్పందించారని చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, నడవడానికి, బయటకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అభిమానులు ఇప్పటికీ తన్ను ఎంతో ప్రేమిస్తున్నారని, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా మళ్లీ నటిస్తానని పేర్కొన్నారు. రీఎంట్రీలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులోని కోరికను వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

తాను ఎప్పుడూ డబ్బు కోసం ఎక్కువ సినిమాలు చేయలేదని, తాను చేసిన పాత్ర ద్వారా ప్రేక్షకులు సంతోష పడాలనే ఆలోచించానని సుధాకర్ తెలిపారు. ముత్యాల సుబ్బయ్య, బి. గోపాల్, రవిరాజా పినిశెట్టి, భీమనేని శ్రీనివాసరావు వంటి దర్శకులతో పనిచేయడం ఎంతో తృప్తిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us
నేను ఆసుపత్రిలో ఉండగా ఆ హీరో వచ్చారు..
నేను ఆసుపత్రిలో ఉండగా ఆ హీరో వచ్చారు..
ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌