AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్

మమ్ముట్టి అభిమానులకు బర్త్ డే ట్రీట్ వచ్చింది. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ సినిమా నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్స్ నటిస్తున్నారు.

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్
OM Movie
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 7:27 PM

Share

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న గురించి ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్స్ వెతుకుతుంటే ఆయ‌నేమో త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు క్రికెట్ మ్యాచ్ చూస్తుండ‌టం వంటి సీన్స్‌ను ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియోలో చూడొచ్చు. అస‌లు మ‌మ్ముట్టి పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని ఎదురు చూసిన వారంద‌రికీ ఈ సినిమాలో ఆయ‌న పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటూనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ధ‌నుష్ పాత్ర‌కు, మ‌మ్ముట్టి పాత్ర‌కు ఎలాంటి కాంపీటీష‌న్ ఉండ‌బోతుంది.. ఈ రెండు పాత్ర‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలా అల‌రించ‌బోతున్నాయోన‌నే ఆస‌క్తి పెరిగింది.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఓం: చాప్టర్1- ఉదిరం: ది బ్ల‌డ్ ఉడ్ ప్ర‌తిష్టాత్మ‌క కాంబినేష‌న్‌లో రూపొందుతోంది. ఈ చిత్రంలో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వండ‌ర్ బార్ ఫిల్మ్స్‌, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పవర్ ఫుల్ పాత్రలో మమ్ముట్టి..

ఓమ్ వీడియో గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us