పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని మాతృశ్రీ ఆస్పత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన ఆమె కడుపులో స్కాన్ చేయగా షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి 13 పెన్నులు, ఐదు చెక్క స్పూన్లు, ఒక క్యాండిల్ విజయవంతంగా తొలగించారు. ఈ సంఘటన స్థానికంగా వైద్య వర్గాల్లో సంచలనం సృష్టించింది.