AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది నటీనటులకు జీవితాన్ని అందించింది. ఈ షో ద్వారా ఫేమస్ అయిన చాలా మంది అటు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. మరికొందరు టీవీల్లో పలు షోలు చేస్తూ అలరిస్తున్నారు. కానీ ఒక నటుడు మాత్రం సినీరంగానికి దూరమై ప్రభుత్వ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు.

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ?
Jabardasth Ganapathi
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 8:47 PM

Share

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది టీమ్‌లో నటిస్తూ, కొన్ని స్కిట్లలో మహిళా వేషధారణలతో సైతం నటించి ప్రేక్షకులను విశేషంగా నవ్వించారు. అయితే, కొద్దిరోజుల కిందట టీవీ షోల నుంచి విరామం తీసుకున్న గణపతి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక సరికొత్త అవతారంలోకి మారారు. నిన్నటివరకు స్టేజీపై నవ్వులు పూయించిన ఈ కమెడియన్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలానికి చెందిన గణపతికి ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడిగా సేవలు అందించడం అనేది దాదాపు 25 సంవత్సరాల కల. 1998 డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌కు సంబంధించి అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఆయనకు ఈ టీచర్ ఉద్యోగం లభించింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆయన టీచర్‌గా బాధ్యతలు స్వీకరించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఒకప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన తాను, ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, వారిని క్రమశిక్షణతో తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టడం ఎంతో తృప్తిని ఇస్తోందని గణపతి ఆనందం వ్యక్తం చేశారు. పాతికేళ్ల నిరీక్షణ తర్వాత తన ఆశయం నెరవేరినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

జబర్దస్త్ గణపతి..

Jabardasth Ganapathi News

Jabardasth Ganapathi News

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..