Neha Shetty: ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను రాబట్టింది. సిద్ధు జొన్నలగడ్డ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి తన అందం, అభినయంతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది డీజే టిల్లుతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో రాధికా పాత్రలో నటించి మెప్పించిన నేహా.. అమాయకురాలిగా కనిపిస్తూనే, మోసం చేసే పాత్రలో ఒదిగిపోయింది.
ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కడంపై తాజాగా ట్విట్టర్ వేదికగా నేహా శెట్టి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ విషయమై నేహా ట్వీట్ చేస్తూ.. ‘రాధికాను టిల్లు నమ్మకపోయినా, మీరు మాత్రం నమ్మరు. మీరు రాధికను అంగీకరించారు. రాధిక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. డీజే టిల్లును ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్ధతు లేనిదో ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ జర్నీని ఇంతే మెమొరబుల్‌గా కొనసాగించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ప్రస్తుతం నేహా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న నేహాకు భవిష్యత్తులో ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.
Tillu dint trust Radhika but you guys did. You guys accepted Radhika. Radhika loves you’ll very much. Thank you for making Dj tillu such a huge success. This couldn’t have happened without your love and support.I promises to strive every single day to make this journey memorable. pic.twitter.com/f98iYusJUr
— Neha Sshetty (@iamnehashetty) March 12, 2022
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరటనిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. ఆ ఆంక్షలు తొలగింపు
PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..