Rajamouli: ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..

|

Nov 01, 2021 | 6:27 AM

Rajamouli: ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమా సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతూ ఏకంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు రాజమౌళి...

Rajamouli: ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..
Rajamouli
Follow us on

Rajamouli: ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమా సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతూ ఏకంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తవైపు ఆకర్షించిన రాజమౌళి తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై దండెత్తడానికి వస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే రాజమౌళి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ కాలేజ్‌ ఫెస్ట్‌కి అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జక్కన్న ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్‌.ఆర్‌.ఆర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను 30 నిమిషాలే కనిపిస్తారాట కదా..? అన్న ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ.. ‘అలా చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా? ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడలేను’ అని చెప్పుకొచ్చారు. ఇక తన సక్సెస్‌కు సీక్రెట్‌ ఏంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఏ రంగంలో అయిన విజయం సాధించాలంటే తగిన ప్రయాణం అవసరమని మొదటి నుంచి నమ్ముతాను. ఏ కథ అయినా నన్ను ప్రేమించాలి. అప్పుడే దాన్ని తెరకెక్కిస్తా. ఈ ప్రయాణమే విజయాల్ని అందిస్తుందని నా నమ్మకం’అని చెబుకొచ్చారు. ఇక తాను ఒకవేళ దర్శకుడి కాకుండి పోయుంటే డ్రైవర్‌ అయ్యేవాడినని చెప్పుకొచ్చాడు రాజమౌళి.

Also Read: T20 World Cup 2021, IND vs NZ Match Result: టీమిండియా సెమీస్ ఆశలపై నీళ్లు.. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

నగర శివారులో పేకాట క్లబ్‌.. నడిపిస్తున్నది ఎవరో తెలిస్తే షాకవుతారు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

Vaccine In China: చైనాలో మూడేళ్ల చిన్నారులకు కరోనా టీకా.. మళ్ళీ కేసులు పెరగడంతో సర్కార్ నిర్ణయం..(వీడియో)